Meizu M1 నోట్
ఈ ఫోన్ కి ఉన్న స్పెసిఫికేషన్స్ ప్రకారం Meizu M1 అందరిని ఆకర్షించింది. దీని ధర ఇంకా వెల్లడి కాలేదు. Meizu M1 లాస్ట్ ఇయర్ చైనా లో రూ.10,000 లకు విడుదల అయ్యింది. ఇండియన్ ప్రైస్ కూడా దీనికి దగ్గరలో ఉండవచ్చు. మే 20న ఈ ఫోన్ 2.00PM నుండి ఈ ఫోన్ అమెజాన్ లో లభిస్తుంది.
Meizu అనేది Zhuhai,china లో స్తాపితమైన ఒక చైనీస్ కంపెని. ఈ కంపెనీ చైనా లో టాప్ పది ఫోన్ తయారీదారులలో ఒకటి.
Meizu M1 నోట్ మీడియా టెక్ MT6752 ప్రాసెసర్ ను వాడుతుంది. ఇది మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 64-బిట్ Qualcomm SoC లు ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు మరియు తయారిదారుల నమ్మకాన్ని కోల్పోయాయి. MT6752 ఇప్పటివరకు HTC డిజైర్ 820s మరియు Gionee Elife S7 వంటి ఫోన్లలో పరీక్షించబడి మంచి ఫలితాలను ఇచ్చింది.
Meizu M1 నోట్ ర్యామ్
దీనిలో 2జిబి ర్యామ్ ఉంది. అయితే రూ.10,000 బడ్జెట్ లో 2జిబి ర్యామ్ అనేది కొత్త కాదు. చాలా ఫోనులు అందిస్తున్నాయి. కానీ కొన్ని బ్రాండెడ్ ఫోన్ల తో పోలిస్తే ఇది ర్యామ్ విషయంలో పై చేయి సాదించినట్టే.
4-ఛానల్ ISP చిప్
ఈ చిప్ కెమేరా లో ఫోటోలను తీసేటప్పుడు డబుల్ స్పీడ్ తో తీస్తుంది. Fujitsu చే డెవెలప్ చేయబడిన ఈ టెక్నాలజీ చాలా త్వరగా ఫోటులు తీసేటప్పుడు వేగంగా అల్గోరిథంలు లెక్కించి షట్టర్ లాగ్ ను తగ్గిస్తుంది.
ఫుల్ హెచ్డి (FHD) డిస్ప్లే
5.5 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే కలిగి ఉన్న ఈ Meizu M1 నోట్ ధర ఒకవేళ రూ.10,000 లోపు ఉన్నట్టు అయితే, డిస్ప్లే విషయంలో ఇది టాప్ మొబైల్ అవుతుంది ఏమో. IGZO డిస్ప్లే టెక్నాలజీ కలిగిన ఈ ఫోన్ షార్ప్ కంపెని చే తయారు చేయబడింది. ఇది పూర్తి లామినేషన్ మరియు గొరిల్లా గ్లాస్ 3 రక్షణ తో లభిస్తుంది.
13MP camera with Dual-tone LED
13MP కెమేరా అనేది ఈ బడ్జెట్ లో కొత్తేమి కాదు కానీ 1 / 3.06-అంగుళాల సెన్సార్ ఇందులో వాడటం జరిగింది. 4-ఛానల్ ISP టెక్నాలజీ దీనికి జోడించడం వలన మంచి నాణ్యత గల ఫోటోలను ఇది తియనుంది. అన్ని ఫోనులు 13MP సోనీ సెన్సార్ ను వాడుతుంటే, Meizu M1 నోట్ మాత్రం సామ్సంగ్ సెన్సార్ ను వాడింది.
పెద్ద బ్యాటరీ
3140mah బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 12 గంటలు 4G వెబ్ సర్ఫింగ్ మరియు 60 గంటలు కాల్ టైం ను ఇస్తుంది అని కంపెని చెబుతుంది.
LTE ఎనేబుల్
త్వరలో రాబోయే ఈ స్మార్ట్ఫోన్ డ్యుయల్ సిమ్కార్డులను మరియు 4G సపోర్ట్ ను కలిగి ఉంది. 4G ఇంకా భారతదేశం లో పెద్దగా వినియోగంలోకి రాలేదు.
యూజర్ ఇంటర్ఫేస్ (UI)
Meizu M1నోట్ దాని సొంత Flyme యూజర్ ఇంటర్ఫేస్ ను వాడుతుంది. Xiaomi MIUI కి దగ్గరగా ఉండే ఈ యూజర్ ఇంటర్ఫేస్ గూగల్ ఆండ్రాయిడ్ 4.4.4 పై నడుస్తాది.
ఇదే బడ్జెట్ లో దీనికి పోటిలో ఉన్న ఫోన్లు:
Xiaomi Mi 4i
Yu Yureka
Honor 4X
Lenovo A7000
Redmi Note 4G