విండోస్ లో యాప్ ఎకో సిస్టం తక్కువ అని తెలుసు, కాని దానిలో ఉన్న టాప్ must have యాప్స్ ను ఇక్కడ చూడండి. క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
myAppFree
24 గంటలకు ఒక సారి ఒక పెయిడ్ యాప్ లేదా పెయిడ్ గేమ్ ను ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోనిస్తుంది.
Comicana
కామిక్స్ చదివే అలవాటు ఉంటె ఇది బాగుంటుంది. క్లిన్ యూజర్ ఇంటర్ఫేస్
6Tag
థర్డ్ పార్టీ ఇంస్టా గ్రామ్ యాప్. అఫీషియల్ ఇంస్టా గ్రామ్ ఉంది కాని అది బీటా లో ఉంది.
Gaana
విండోస్ ఫోన్ లో ఆల్రెడీ MixRadio యాప్ ఉంది. బాగుంటుంది. కాని Gaana లో ఇండియన్ ట్రాక్స్ ఉండటం వలన ఈ లిస్టు లో ఉంది.
మెట్రో ట్యూబ్
విండోస్ లో youtube లేదు అఫీషియల్ గా, సో ఇది థర్డ్ పార్టీ youtube యాప్. 62 రూ పెయిడ్ యాప్ ఇది. వీడియోస్ చూడటమే కాదు కామెంట్స్ కూడా చేయగలరు. మీకు యాప్ కొనటం ఇష్టం లేకపోతే బ్రౌజర్ లో ఓపెన్ చేసుకున్న అన్నీ పొందగలరు ఫ్రీ గా.
adobe photo express
లూమియా క్రియేటివ్ స్టూడియో తో పాటు మరొక మంచి ఫోటో ఎడిటింగ్ యాప్ ఇది. ఫ్రీ గా ఉన్న ఎడిట్ కూడా ఫిల్టర్స్ బాగున్నాయి.
Netflix
కొన్ని రోజుల క్రితమే ఇండియా లో రిలీజ్ అయ్యింది ఇది. వెంటనే విండోస్ లో కూడా అఫీషియల్ యాప్ క్రియేట్ చేసింది కంపెని. ఫేవరేట్ షోస్ సబ్స్ స్క్రైబ్ చేసుకొని చూడటమే.
ABP Live/NDTV
దీనికి మిగిలిన వాటికీ తేడా...ఈ అప్లికేషన్ లైవ్ వీడియో స్ట్రిమింగ్ ఇస్తుంది. NDTV టోటల్ చానెల్స్ అన్నీ వస్తాయి.
POKI
ఇది ఆండ్రాయిడ్ లో pocket యాప్ వలె విండోస్ లో ఆర్టికల్స్ ను సేవ్ చేసి తరువాత చదువుకునే వీలు ఇస్తుంది. వీటిని రీడింగ్ అనే కాకుండా listen కూడా చేయగలరు. users URL లను డెస్క్ టాప్/టాబ్లెట్ అండ్ మొబైల్ లో కూడా సేవ్ చేయవచ్చు.
ఆఫీస్ లెన్స్
బెస్ట్ డాక్యుమెంట్ స్కానర్ యాప్ . స్కాన్ చేసిన వాటిని pdf వర్డ్ ఫార్మాట్స్ లో సేవ్ చేయవచ్చు.