ఎన్నో అంచనాలతో ఆపిల్ 6S అండ్ 6S ప్లస్ మోడల్స్ లాంచ్ చేసింది. అసలు వీటిలోని ఉన్న ఫీచర్స్ చుస్తే ఆండ్రాయిడ్ ఫోనుల్లో చాలా నార్మల్ గా వాటి కన్నా తక్కువ రేటు కు వస్తున్నాయి. ఆపిల్ డిజైన్, os సాఫ్ట్ వేర్ పరంగా స్టాండర్డ్ గా రిచ్ గా ఉంటుంది. అందులో డౌట్ లేదు. కాని 55,000 రూ నుండి 65,000 రూ పెట్టి ఫోన్ కొంటుంటే అందులో అన్నీ లేటెస్ట్ గా ఉండాలని కోరుకుంటాము కదా? ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ అండ్ మేజర్ ,మోడల్స్ లో ఉన్నవి చాలా వరకూ ఐ ఫోన్ 6S లేటెస్ట్ మోడల్స్ లో లేవు. అవేంటో చూడండి.. క్రిందకు వెళ్లండి లేదా స్క్రోల్ చేయండి.
స్క్రీన్ రిసల్యుషణ్
అన్నీ మేజర్ ఆండ్రాయిడ్ ఫోనుల్లో 2K రిసల్యుషణ్ ఉన్నాయి. LG g4, సామ్సంగ్ S6, సోనీ Z5 లో అయితే 4K ఉంది. కాని ఆపిల్ లో రెటీనా ఒకటే చెప్పుకోదగినదిగా కనిపిస్తుంది.
OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్)
దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోనుల్లో ఇది ఉంది. ఆపిల్ ఇప్పుడు లేటెస్ట్ గా 6S దించింది ఈ ఆప్షన్. అది కూడా 6S ప్లస్ మోడల్ లో మాత్రమే, 6S లో లేదు. OIS అనేది మనం కదులుతూ లేదా కదిలే సబ్జెక్ట్ లను ఫోటో తీస్తే, ఇమేజ్ బ్లర్ గా రాకుండా చేస్తుంది.
బ్యాటరీ లైఫ్
ఐ ఫోన్స్ లో ప్రతీ మోడల్ లో అతి తక్కువ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. కారణం తక్కువ mah బ్యాటరీ లు. ఇప్పుడు ఆండ్రాయిడ్ లో 5000 రూ బడ్జెట్ ఫోనుల్లో సైతం 4000 mah బ్యాటరీ లు ఉంటున్నాయి.
ఇంబిల్ట్ స్టోరేజ్ స్పేస్
మిడ్ ర్యాంజ్ ఆండ్రాయిడ్ ఫోనులు సైతం మినిమమ్ 16gb ఇంబిల్ట్ స్టోరేజ్ తో పాటు sd కార్డ్ సపోర్ట్ ఇస్తున్నాయి. మేజర్ ఫోనుల్లో అయితే మినిమమ్ 32gb స్టోరేజ్ ఇంబిల్ట్. ఐ ఫోన్ 6S లో డిఫాల్ట్ గా 16gb ఉంటుంది స్పేస్ ఇంబిల్ట్ గా. అంతే దానికి sd కార్డ్ సపోర్ట్ కూడా ఇవ్వటానికి ప్రయత్నాలు చేయటం లేదు ఆపిల్.
ర్యామ్
ఎక్కువ ర్యామ్ ఉంటే ఎక్కువ మల్టీ టాస్కింగ్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ అంటే, ఒకే సారి ఎక్కువ యాప్స్ ను వాడటం. కొంతమంది మేము అంత వాడము అని అంటారు. కాని వాస్తవంలో ప్రస్తుతం ఆన్ లైన్ అవసరాలకు వాడుతున్న యాప్ ను వదిలి మరొక యాప్ ఓపెన్ చేయవలసిన పరిస్థితిలు వస్తున్నాయి. i ఫోన్ 6S లో 2gb ర్యామ్ ఉంది. అది ఆపిల్ os కు ప్రొసెసర్ కు సరిపోవచ్చు కాని 55,000 రూ పైగా అమౌంట్ పెట్టి కొంటుంటే ఆండ్రాయిడ్ ఫోనుల్లో 4gb ర్యామ్ లు ఉండగా ఇంకా 2gb ర్యామ్ ఏంటి అని ప్రశ్న.
వాటర్ ప్రూఫ్
మోటో g 3rd gen i ఫోన్ 6S లో 1/6 th తక్కువ ధరలో వాటర్ రెసిస్టన్స్ తో వస్తుంది. సోనీ z సిరిస్ IP68 వాటర్ ప్రూఫ్ సర్టిఫికేషన్ తో వస్తుంది.
వైర్ లెస్ చార్జింగ్ లేదు
ఆండ్రాయిడ్ లో ఉన్న ఫ్లాగ్ షిప్ మోడల్ సామ్సంగ్ గేలక్సీ S6 వైర్ లెస్ చార్జింగ్ ను ఇస్తుంది. ఆపిల్ అసలు ఈ టెక్నాలజీ ను కంప్లీట్ గా ignore చేసింది 6S లో.