యు యురేకా
పెర్ఫార్మెన్స్ విషయంలో రూ.10,000 ధర లో దొరికే ఫోన్లలో మైక్రోమ్యాక్స్ యు యురేకా ని మించిన ఫోన్ మరొకటి లేదు. దీని కెమేరా కూడా డిసెంట్ క్వాలిటిని ఇస్తుంది.
యు యుఫోరియా
తాజాగా విడుదలైన యుఫోరియా అమెజాన్ లో రూ.6,999 కు లభిస్తుంది. ప్రీమియం మెటల్ బాడీ తో 5 అంగుళాల స్క్రీన్ తో ఇది మొదటి స్థానం లో ఉంది. రెండవ స్థానానికి కారణం స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ మరియు 2జిబి ర్యామ్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కలిపి ఈ ధరకు లభించటమే.
లెనోవో A6000 ప్లస్
1.2GHz క్వాడ్-కోర్ స్నాప్డ్రాగెన్ 410 ప్రాసెసర్ తో పాటు 2GB ర్యామ్ తో వస్తున్న లెనోవో ప్లస్ మూడవ ప్లేస్ లో ఉంది. 4G మరియు 8MP కెమేరా దీనికి అదనపు ఆకర్షణలు.
Xiaomi రెడ్మీ 2
రెడ్మి 2 లో మంచి లుక్స్, మంచి స్పీడ్, మంచి కెమేరా, వీటితో పాటు పట్టుకోవటానికి కూడా మంచి సౌలభ్యంగా ఉండే ఫోన్ బహుశా అతి తక్కువ ధరలో ఇది ఒకటేనేమో.
మోటరోలా మోటో E (2nd Gen) LTE
మోటోరోలా నుండి వస్తున్న మోటో ఇ రెండవ ఫోనులో LTE ని జోడించడం పోటిలో నిలబడే లా చేసింది. దీని బిల్డ్ మొదటి మోటో ఇ కన్నా గొప్పగా ఉంది.
స్నాప్డ్రాగెన్ 200 SoC, 1GB RAM తో వస్తున్న ఈ ఫోన్ రూ.10,199 ధరకు లభిస్తుంది. ఇది అదనంగా రూ.200 ఎక్కువుగా ఉన్నా, లూమియా 540 ను కూడా ఈ లిస్టు లో పెట్టవచ్చు.
హానర్ 4x
రూ.10,499 ధరలో 500 రూపాయలు ఎక్కువుగా ఉన్నప్పటికీ హానర్ 4x మంచి బిల్డ్ మరియు లేటెస్ట్ హార్డువేర్ తో లభిస్తుంది. 3000mah బ్యాటరీ మరియు 13MP కెమేరా తో వస్తున్న ఈ ఫోన్ ఈ లిస్టులో ఉండటం కరెక్ట్.