ఆండ్రాయిడ్ లో లాంచర్స్ users కు ఒక ప్లస్ పాయింట్. వీటి ద్వారా బోర్ కొట్టకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త లుక్స్ ను క్రియేట్ చేసుకోగలరు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో. కేవలం లుక్స్ మాత్రమే కాకుండా ఫీచర్స్ మరియు షార్ట్ కట్స్ ను ఇస్తాయి ఇవి. టాప్ లాంచర్లు ఏంటో చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి,
Z Launcher
ఇది నోకియా తయారు చేసిన లాంచర్. కాని ఇంకా బీటా టెస్టింగ్ లోనే ఉంది. ప్రధానమైన ఫీచర్, home స్క్రీన్ పై ఏ ఆల్ఫబేట్ అయిన చేతి వేలితో వ్రాస్తే ఆ ఆల్ఫా బెట్ తో మొదలయ్యే యాప్స్ ను చూపిస్తుంది. వెబ్ హిస్టరీ, బుక్ మార్క్స్ కూడా..మెయిన్ స్క్రీన్ లో ఎక్కువుగా వాడిన 6 యాప్స్ ను చూపిస్తుంది. లాంచర్స్ ను డౌన్లోడ్ చేయటానికి వాటి పేర్ల పై కలి చేయండి.
Arrow Launcher
ఇది మైక్రో సాఫ్ట్ దేవలప్ చేసిన లాంచర్. ఫీచర్స్ అన్నీ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఒకసారి ట్రై చేయటానికి ఇది worth లాంచర్.
Google Now launcher
ఇది గూగల్ డెవలప్ చేసినది అని వేరేగా చెప్పనవసరం లేదు. క్లిన్ ఇంటర్ఫేస్, ఒరిజినల్ ఆండ్రాయిడ్ లుక్స్ కలిగి ఉంటుంది. ప్రత్యేకత ఏంటంటే హోమ్ స్క్రీన్ లో లెఫ్ట్ నుండి రైట్ కు స్వైప్ చేస్తే గూగల్ కార్డ్స్ ఫీచర్స్ పొందుతారు. ఇది మీ మెయిల్ లేదా మెసేజెస్ లో ఉండే జర్నీ టికెట్స్ లేదా పార్సిల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మరియు instant remainders ను కూడా అందిస్తుంది. కాని customisation ఉండదు.
Solo launcher
మేటేరియాల్ డిజైన్ తో ఎక్కువ ఐకాన్ పాక్స్ , వాల్ పేపర్స్, థీమ్స్ అన్నీ లాంచర్ లోపలే ఇస్తుంది.
Hola Launcher
చాలా తక్కువ సైజ్ లో (initial డౌన్లోడ్ 1MB) తక్కువ ర్యామ్ వాడే లాంచర్ ఇది. అయినా customisations అన్నీ ఉన్నాయి.
Nova లాంచర్
స్టాండర్డ్ స్టాక్ లాంటి యూసర్ ఇంటర్ ఫేస్ ను లైక్ చేసి వారు, స్పీడ్ గా సింపుల్ గా ఉండాలనుకునే వారు దీనిని ట్రై చేయండి. ఇది బాగా ఫేమస్ లాంచర్ స్పీడ్ మరియు అవసరం అయిన ఫీచర్స్ ను ఇవ్వటంలో. యాప్ dock ను, ఐకాన్స్ సైజ్ లను కూడా మార్చుకోగలరు
Go launcher Z
ఇది Go లాంచర్ EX కు అప్ గ్రేడ్ వెర్షన్. extremely customising ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో. 10 వేలకు పైగా థీమ్స్. మెమరీ క్లీనర్, యాప్ మేనేజ్మెంట్, లాకింగ్ అండ్ హైడింగ్ యాప్స్ ఫీచర్స్ ఉన్నాయి.
SF Launcher 2
గూగల్ నౌ లో ఉండే కార్డ్స్ డిజైన్ అంటే ఇష్టం ఉంటే ఈ లాంచర్ ట్రై చేయండి. హోమ్ లోనే ఎక్కువ customising ఉంటుంది. హెడర్ ఇమేజెస్, స్టైల్స్, time based ఆటోమేటిక్ theming కూడా ఉంది.
Buzz Launcher
దీని గురించి బహుశా చాలా మందికి తెలిసే ఉంటుంది. highly customise చేసుకోవటానికి వీలు ఇస్తుంది. వేరే వాళ్లు క్రియేట్ చేసిన థీమ్స్ అన్నిటినీ లాంచర్ నుండే డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోగలరు. కేవలం థీమ్స్ అనే కాకుండా లాంచర్ లో కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి.
Quixey లాంచర్
డిఫరెంట్ ఆప్షన్స్ తో తక్కువ క్లిక్స్ లేదా టచెస్ లోనే ఫంక్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఈ లాంచర్ టీం. ట్రై చేసి చూడండి.