మీకు తెలియని useful ఆండ్రాయిడ్ యాప్స్ ను పరిచయం చేయటమే ఈ సిరిస్ ముఖ్య ఉద్దేశం. రైల్వేస్ info అండ్ అవసరాలకు చాలా యాప్స్ ఉన్నాయి. కాని ఇప్పుడు చెప్పబోయే యాప్ అన్నిటి కన్నా బాగుంది. పేరు Indian Railway PNR& IRCTC Info. 11MB అండ్ 4.5స్టార్ రేటింగ్ తో ప్లే స్టోర్ లో ఈ లింక్ లో ఉంది. క్రిందకు స్క్రోల్ చేస్తే దీనిలోని హై లైట్స్ అండ్ ఫీచర్స్ చూడగలరు.
ఫీచర్స్..
లైవ్ ట్రైన్ స్టేటస్, pnr స్టేటస్, లైవ్ స్టేషన్ info, book అండ్ cancel టికెట్స్, సీటింగ్ మాప్, సీట్ availability, fare ఎంక్వయిరీ, ట్రైన్స్ schedule అండ్ కోచ్
అంతే కాదు రైల్వేస్ లో జరిగే మార్పులను, కొత్త అప్ డేట్స్ మరియు కొత్తగా ప్రవేసపెట్టిన సర్వీసెస్, ట్రైన్స్ మరియు సదుపాయాలను నోటిఫికేషన్స్ ద్వారా తెలియజేస్తుంది.
యాప్ ఎందుకు బెస్ట్ అంటే దీనిలో తీరని అవసరం అంటూ ఏమి ఉండదు. డెస్క్ టాప్ మోడ్ లో irctc వెబ్ సైట్ ను యాప్ లోపలే ఓపెన్ చేసి టికెట్స్ బుకింగ్, cancellation వంటివి కూడా చేసుకోగలరు. అయితే ఇది అంత కంఫర్ట్ గా అనిపించకపోవచ్చు స్క్రీన్ సైజ్ కారణాల వలన.
బాగా useful అనిపించే విషయం మీరు ట్రైన్ లో జర్నీ చేస్తున్నప్పుడు ట్రైన్ ఎంతవరకూ వచ్చింది అని యాప్ లో లైవ్ ట్రైన్ స్టేటస్ ద్వారా ఇంటర్నెట్ ఉంటే తెలుసుకోగలరు., ఎవ్వరినీ అడిగే సందర్భం రాదు. నేను పర్సనల్ గా వాడినప్పుడు కరెక్ట్ గా చూపించేది లైవ్ స్టేటస్.
ట్రైన్స్ ఎక్కడ నుండి మొదలై ఏ రూట్ లో వెళ్తాయి, దానిలో పాంట్రీ ఉందా లేదా, జర్నీ టైమ్ ఎంత సేపు, ఎంత సమయం ట్రైన్ late లో ఉంది. ఏ ప్లాట్ ఫార్మ్ లో ఆగుతుంది వంటి డిటేల్స్ కూడా ఇస్తుంది. coaches order ఏంటి ఇలా కంప్లీట్ అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది యాప్. ఒకసారి ట్రైన్ లేదా pnr చెక్ చేసినప్పుడు అది యాప్ డేటా లో ఉండిపోతుంది. ప్రతీ సారి ఎంటర్ చేయనవరం లేదు డిటేల్స్.