రీసెంట్ గా గూగల్ సీఈఓ ఇండియాలో జరిగిన ఈవెంట్ లో కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేశారు. ఇవి ఇండియాలో మాత్రమే వస్తున్నాయి. ఇవి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి..అవేంటో చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
Railwire
ఇండియన్ రైల్వే స్టేషన్స్ లో railwire ద్వారా ఫ్రీ WiFi ను అందిస్తుంది. ముంబాయి లో ముందుగా ప్రారంభం. 2016 ముగిసే సరికి 100 స్టేషన్స్ లో ఈ సర్విస్ అందించనుంది. ఈ నెట్ తో డౌన్లోడింగ్, వీడియోస్, బ్రౌజింగ్ ఏదైనా చేయగలరు. అన్ లిమిటెడ్ కాని మొదటి గంట హై స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది, తరువాత స్పీడ్ తగ్గుతుంది. వచ్చే నెలలో ప్రారంభం అవుతుంది సర్విస్.
Internet Saathi
రూరల్ ఇండియాలోని స్త్రీలను ఇంటర్నెట్ బైక్స్ ద్వారా కనెక్ట్ చేయనుంది. Internet Saathi అనే ప్రాజెక్ట్ ద్వారా ఇండియన్ women కు ఇంటర్నెట్ వలన ఉపయోగాలు నేర్పనుంది. 3 సంవత్సరాలలో 3 లక్షల గ్రామాలను తిరగనుంది ఇందుకోసం.
కొత్త ఉద్యోగాలు
బెంగలూరు, హైదరాబాద్ లో ఉన్న గూగల్ కంపెనీలకు కొత్త గా జాబ్ ఆఫర్స్ ఇస్తుంది. 20 లక్షల ఆండ్రాయిడ్ డెవలపర్స్ ను ట్రెయిన్ చేయటానికి కొత్త ప్రాజెక్ట్ చేస్తుంది. ఇందుకోసం ఇండియాలోని 30 యూనివెర్సిటి లతో కలవనుంది.
యూట్యూబ్ ఆఫ్ లైన్ వీడియో కొత్త ఫీచర్స్
వీడియోస్ ను డౌన్లోడ్ చేసుకోవటానికి టైమ్ సెట్ ఫీచర్, బ్యాక్ గ్రౌండ్ డౌన్లోడ్ ఫీచర్, కంప్లీట్ బఫరింగ్ while video is paused
ఇండియాలో ఆసుస్ క్రోమ్ బిట్ డివైజ్ అనౌన్స్ చేశారు. ఏదైనా HDMI పోర్ట్ కలిగిన మానిటర్ కు కనెక్ట్ చేస్తే అది విండౌస్ pc వలె పనిచేస్తుంది. ధర 7,999 రూ. జనవరి 2016 లో రిలీజ్ అవనుంది.