స్మార్ట్ ఫోన్ అనేది అప్పుడప్పుడే బాగా పాపులర్ అవుతున్న తరుణంలో మొబైల్స్ లో యాంటి వైరస్ యాప్స్ వాడటం కరెక్ట్ కాదు.. ఎందుకంటే ర్యామ్ మరియు బ్యాటరీ వంటివి బాగా హరించ బడతాయి అని చెప్పటం జరిగేది అందరికీ. కాని ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనేది చాలా casual అండ్ బాగా డిమాండ్ ఉన్న సెగ్మెంట్. సో హ్యాకర్స్ మరియు వైరస్ లు కూడా ఈ మార్కెట్ ను అటాక్ చేయటానికి టార్గెట్ చేసుకుంటున్నాయి. ఫర్ eg మీకు తెలియని వెబ్ లింక్ ను టచ్ చేస్తే మీ మొబైల్ లో మాల్వేర్ యాప్స్ ఇంస్టాల్ అయ్యి మీ డేటా(పర్సనల్ అండ్ బ్యాంక్ డిటేల్స్) ను యాక్సిస్ చేసి చాలా ఇబ్బందులు తెస్తున్నాయి. సో ప్లే స్టోర్ లో చాలా యాప్స్ ఉండగా వాటిలో 3 టాప్ యాప్స్ ను మీకు ఇక్కడ differences తో తెలియజేస్తున్నాము. క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
గమనిక: ఇవి బెస్ట్ 3 యాంటి వైరస్ కాదు. కేవలం 3 మేజర్ యాంటి వైరస్ యాప్స్ analysis
టాప్ 1 - Norton మొబైల్ సెక్యురిటీ
ఫీచర్స్
- ఫోన్ ట్రాకర్, పాస్ వర్డ్ మేనేజర్, లైసెన్స్ ట్రాన్స్ ఫర్, కాంటాక్ట్స్ క్లౌడ్ స్టోరేజ్
ప్లస్
- యాప్స్ advisor
- తక్కువ రిసోర్సెస్(ర్యామ్ usage, బ్యాటరీ etc) తీసుకుంటుంది
- బ్యాటరీ consumption 2%
మైనస్
- సిస్టం tuning లేదు
- రియల్ ఫీచర్స్ అన్నీ ప్రీమియం వెర్షన్ లో ఉన్నాయి.
ర్యామ్ usage
బ్యాక్ గ్రౌండ్ రన్నింగ్ లో 50MB ర్యామ్ తీసుకుంటుంది, foreగ్రౌండ్ రన్నింగ్ లో 160MB తీసుకుంటుంది ర్యామ్ నుండి
టాప్ 2nd - Trend Micro తయారు చేసిన మొబైల్ సెక్యూరిటీ అండ్ వైరస్
ఫీచర్స్
- ఫోన్ ట్రాకర్, లైసెన్స్ ట్రాన్సఫర్, పాస్వర్డ్ మేనేజర్, క్లౌడ్ స్టోరేజ్
ప్లస్
- లైసెన్స్ ట్రాన్స్ ఫర్
- సిస్టం tuning
మైనస్
- బ్యాటరీ consumption 5%
- రిసోర్సెస్ ఎక్కువ వాడుతుంది
- iOS యాప్ లో వెబ్ స్కానర్ కొంచెం weak గా ఉంది.
ర్యామ్ usage
బ్యాక్ గ్రౌండ్ - 18MB fore గ్రౌండ్ - 222MB
3rd - Kaspersky
ఫీచర్స్ - ఫోన్ ట్రాకర్, లైసెన్స్ ట్రాన్స్ ఫర్ లేదు, పాస్వర్డ్ మేనేజర్, క్లౌడ్ స్టోరేజ్ లేదు
ప్లస్
- ఫోల్డర్ స్కానింగ్, క్విక్ స్కాన్ అండ్ ఫుల్ స్కాన్
- తక్కువ ర్యామ్ తీసుకుంటుంది.
- బ్యాటరీ consumption 2%
మైనస్
- సింగిల్ యాప్ స్కానింగ్ ఫెయిల్
- harmful వెబ్ సైట్స్ ను బ్లాక్ చేయలేకపోతుంది
ర్యామ్ usage
బ్యాక్ గ్రౌండ్ ర్యామ్ - 83MB, fore గ్రౌండ్ ర్యామ్ -110MB
ఎండ్ లైన్ - స్కానింగ్ తప్పితే ఇది ఇంటర్నెట్ సెక్యురిటీ బాగా ఇవ్వటం లేదు. ఇంటర్నెట్ సెక్యురిటీ అనేదే అసలు ఇంపార్టెంట్.
బెస్ట్ పెర్ఫర్మార్ యాంటి వైరస్ గా నార్టన్ 1st ప్లేస్ లో ఉంది. టోటల్ స్కాన్ టైమ్ బాగా తక్కువ మిగిలిన వాటితో పోలిస్తే అలాగే రియల్ టైమ్ లో కూడా ప్రొటెక్షన్ బాగా ఇస్తుంది. ఫుల్ పెరంటింగ్ కంట్రోల్ ఆప్షన్స్ ఇవటం వలన కూడా ఇది 1st rank లో ఉంది.
బెస్ట్ యాంటి వైరస్ to buy లో ట్రెండ్ మైక్రో తయారు చేసిన యాంటి వైరస్ ముందు ఉంది. కేవలం పెర్ఫార్మెన్స్ వలన నార్టన్ ను మించలేకపోయింది.
kaspersky మిగిలిన రెండింటితో పోలిస్తే పెర్ఫార్మెన్స్ లో వాటి దగ్గరిలో కూడా లేదు. కేవలం UI మాత్రమే బాగుంది.
గమనిక: మేము టెస్ట్ చేసిన కొన్ని ఫీచర్స్ మరియు ర్యాంకింగ్ పెయిడ్ వెర్షన్ తో వచ్చే రిసల్ట్స్ ను బేస్ అయ్యి ఉంటుంది.