మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: గిగాటో

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Dec 01 2015
మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: గిగాటో

యాప్ పేరు Gigato. ఇది ఇండియన్ అప్లికేషన్. Wi-Fi ఇంటర్నెట్ లేక మొబైల్ ఇంటర్నెట్ ఎక్కువుగా వినియోగించే వారికీ బాగా useful గా ఉంటుంది. 
ఏమి చేస్తుంది?
మొబైల్ లో మీరు ఎప్పుడూ వాడే యాప్స్ ను మీ మొబైల్ ఇంటర్నెట్ ద్వారా వాడితే, gigato మీకు ఎంత వాడారో దాని కన్నా ఎక్కువ MB ఫ్రీగా మీ మొబైల్ అకౌంట్ లోకి వేస్తుంది.
క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి

మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: గిగాటో

ఎలా పనిచేస్తుంది?
యాప్ ను మొబైల్ నంబర్ తో సైన్ అప్ అవ్వాలి ముందు. తరువాత మీ మొబైల్ లో ఏ యాప్స్ ను gigato సపోర్ట్ చేస్తుందో స్కాన్ చేసి "MY APPS" టాబ్ క్రింద చూపిస్తుంది. (ముందు ఒక యాప్ మాత్రమే కనిపించవచ్చు my apps లో. కాని వెయిట్ చేస్తే మరిన్ని యాప్స్ వస్తాయి.)
ఇప్పుడు ప్రతీ యాప్ కు కొంత MB లిమిట్ చూపిస్తుంది యాప్ పేరు క్రింద. అంటే మీరు కనుక gigato చెప్పినట్టు 10 లేదా 20MB ఆ పర్టికులర్ యాప్ ఓపెన్ చేసి వాడితే, మీకు అదనంగా 15MB నుండి 20MB వస్తుంది.

ఇలా ప్రతీ యాప్ కు ఉంటుంది. అవన్నీ కలిపితే ఒక 150MB నుండి 250MB వరకూ ఉంటుంది. సో మీరు రోజుకి 150/250mb వాడితే మీకు దాని కన్నా ఎక్కువ ఫ్రీ డేటా ఇస్తుంది. అంటే మీరు డేటా వాడినా వదనట్లే. 150 నుండి 250 MB రోజూ వాడాలంటే ఎక్కువ అనిపించవచ్చు మీకు కాని మీరు ఎలాగో డైలీ గా వాడే యాప్స్ ను వాడినా ఇస్తుంది కాబట్టి, ఇది సింపుల్ గానే ఫినిష్ అవుతుంది.

మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: గిగాటో

మొత్తం అన్నీ MB allotments వాడిన తరువాత 4 నుండి 12 గంటలలోపే మీరు earn చేసిన డేటాను ఇస్తుంది. ఎప్పటికప్పుడు మీరు ఎంత డేటా earn చేసారో పైన రింగ్ లో చూడగలరు.

1. అయితే మీరు ఆ యాప్స్ ను మొబైల్ ఇంటర్నెట్ లోనే వాడాలి.
2. ఇది 2G అండ్ 3G పైనా పనిచేస్తుంది.
3. మీకు ఆ రోజు ఎంత MB వాడలో నోటిఫికేషన్ ఇస్తుంది యాప్ లో సైన్ అప్ అయిన తరువాత.
4. యాప్స్ ను వాడటానికి gigato లోకి వెళ్లి వాటిని ఓపెన్ చేయనవసరం లేదు.
5. రెగ్యులర్ గా యాప్స్ ను ఎలా ఓపెన్ చేస్తారో అలా ఓపెన్ చేసి వాడుకోగలరు. డేటా కౌంట్ అవుతుంది ఎలా ఓపెన్ చేసి వాడినా.
6. ఇంకా ఎంత MB వాడలో కూడా ఎప్పటికప్పుడు నోటిఫై చేస్తుంది మొబైల్ నోటిఫికేషన్ bar లో.
7. మనం ఇంస్టాల్ చేసిన యాప్స్ ను వాడితే నెట్ బ్యాలన్స్ ఇవ్వటమే కాక అది కొన్ని యాప్స్ చెబుతుంది వాటిని జస్ట్ ఇంస్టాల్ (ఇంస్టాల్ చేశాక వాడనవసరం లేదు) చేస్తే కొంత MB ఇస్తుంది.
8. ఇవి 10MB నుండి 50MB వరకూ ఉంటాయి.
9. టాప్ లెఫ్ట్ సైడ్ నేవిగేషన్ లోకి వెళితే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. క్రింద ఉండే Help లో యాప్ ఎలా పనిచేస్తుంది అనే విషయం కూడా ఉంది. 

మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: గిగాటో

ప్లస్ పాయింట్స్ -
1. మీరు ఆల్రెడీ ఇంస్టాల్ చేసి రెగ్యులర్ గా వాడుకునే యాప్స్ కు సపోర్ట్ చేస్తుంది. కొత్తగా యాప్స్ ఏమీ డౌన్లోడ్ చేయనవసరం లేదు.

2. రోజూ ఇంటర్నెట్ ను బాగా వాడేవారికి ఇది మంచి యాప్. కేవలం మొదటి సారి వాడినప్పుడు మాత్రమే మీ సొంత ఇంటర్నెట్ పై వాడతారు. తరువాత యాప్ ఇచ్చిన లిమిట్ ను ఫినిష్ చేస్తే రోజూ ఫ్రీ ఇంటర్నెట్ ను పొందుతారు

మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: గిగాటో

డౌన్లోడ్ - ఈ లింక్ లో ఉంది ప్లే స్టోర్ లో. 3.9 స్టార్ రేటింగ్. 10MB ఉంది యాప్ సైజ్. 2G ఇంటర్నెట్ స్పీడ్ లో 10 మినిట్స్ పడుతుంది డౌన్లోడ్ అవ్వటానికి. కేవలం ఆండ్రాయిడ్ కు మాత్రమే ఉంది.