ఎవ్వరికీ పెద్దగా తెలియని యాప్స్ ను పరిచయం చేయటమే ఈ సిరిస్ లక్ష్యం. సో ఈ సారి మీరు చూడబోయే యాప్ Yandex లాంచర్ అప్లికేషన్. దీనిలో ఉన్న విషయాలు తెలుసుకోవటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.
ఇది అన్నీ లాంచర్స్ వలె సేమ్ యాప్ డ్రాయర్ కాన్సెప్ట్ తో వస్తుంది, కాని కొన్ని ఫ్రెష్ డిజైన్స్ ఉన్నాయి. ప్లే స్టోర్ లో ఇది 4.5 స్టార్ రేటింగ్ తో 25MB సైజ్ కలిగి ఉంది. యాప్ లో హై లైట్ విషయం ఏంటంటే మీరు home స్క్రీన్ లో లెఫ్ట్ నుండి రైట్ కు స్వైప్ చేస్తే తెలుగు, ఇంగ్లిష్ లో కూడా కేటగిరిస్(సినిమా, టెక్నాలజీ, పాలిటిక్స్, స్పోర్ట్స్) వైజ్ గా న్యూస్ అప్ డేట్ లను అక్కడికక్కడే తెలుసుకోగలరు.
హోమ్ స్క్రీన్ లో క్రిందకు స్క్రోల్ చేస్తే, కాంటాక్ట్స్, యాప్స్ ఆన్ లైన్ సర్చింగ్ చేసుకోగలరు. స్వైపింగ్ చాలా స్మూత్ గా ఫాస్ట్ గా ఉంది. గూగల్ నౌ లాంచర్ మాదిరిగా సర్చ్ బటన్ మీద టాప్ చేస్తే రెండు మూడు సేకెండ్స్ తరువాత ఓపెన్ అవ్వదు, వెంటనే సర్చ్ బటన్ ఓపెన్ అవుతుంది. లుక్స్ వైజ్ గా కూడా సర్చ్ బార్ లో గూగల్ మధ్యలో వ్రాసి ఉంటుంది. కొంచెం భిన్నంగా ఉంది.
థర్డ్ పార్టీ ఐకాన్ పాక్స్ ను ప్లే స్టోర్ నుడ్ని డౌన్లోడ్ చేసుకొని లాంచర్ లో ఐకాన్స్ మార్చుకోగలరు. అయితే ఒక్కొక్కటి మార్చుకోవటానికి అవ్వదు. అలాగే వాల్ పేపర్స్ ను కూడా కేటగిరిస్ వైజ్ గా ఇంటర్నెట్ నుండి యాప్ లోనే డౌన్లోడ్ చేసుకోగలరు.
థీమ్స్ లో కేవలం రెండు ఉన్నాయి. ఒకటి వైట్ మరొకటి బ్లాక్. అంటే లాంచర్ లో ప్రతీ చోట బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ గ్రౌండ్స్ మారతాయి అంతే. ఐకాన్స్ లో ఎటువంటి changes ఉండవు.
యాప్ డ్రాయర్ లో లుక్స్ బాగుంటాయి. ఇక్కడ రెండు కొత్త ఆప్షన్స్ ఉన్నాయి. పైన కేటగిరిస్(గేమ్స్, సోషల్, టూల్స్) వైజ్ గా నేమ్స్ ఉంటాయి, వాటిపై టచ్ చేసిన హారిజంటల్ గా స్క్రోల్ చేసిన ఆ కేటగిరిస్ లోకి వెళ్తాము. అలాగే క్రింద కలర్స్ ఉంటాయి వాటిపై టచ్ చేస్తే ఆ కలర్ లో ఉండే యాప్స్ అన్నీ కన్పిస్తాయి. వైట్ లో ఉంటే అన్నీ యాప్స్ అదే bar లో వెర్టికల్ గా ఉంటాయి. ప్లే స్టోర్ లో యాప్ ఈ లింక్ లో ఉంది.