కంప్యూటర్ టిప్స్ : మీకు తెలియని స్మాల్ థింగ్స్

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Aug 04 2015
కంప్యూటర్ టిప్స్ : మీకు తెలియని స్మాల్ థింగ్స్

మీ కంప్యూటర్ లో మీరు డెయిలీ చేసే పనులను సింపుల గా చేయటానికి కొన్ని షార్ట్ కట్ బటన్స్ ఉన్నాయి. అయితే అన్ని షార్ట్ కట్స్ ను ఇక్కడ పొందిపరిస్తే వాటిని చదివే ఓపిక ఉండదని... ఉన్నా చదివిన వాటిని గుర్తుపెట్టుకోవటం కష్టం అని కేవలం మోస్ట్ యూజబుల్ షార్ట్ కట్స్ ను ఇక్కడ చెప్పటం జరిగింది.  నెక్స్ట్ స్లైడ్ కు వెళ్లండి.

కంప్యూటర్ టిప్స్ : మీకు తెలియని స్మాల్ థింగ్స్

PrtSc
మనకు చిన్నప్పటినుండి PrtSc బటన్ బాగా పరిచయం కాని దాని ఉపయోగం కొంతమందికే తెలుసు. PrtSc అంటే Print Screen. ఇది ఒక Unknown యూజ్ఫుల్ బటన్. మీ కంప్యూటర్ లో ఏదైనా ఒక పని ఎలా చేయాలో తెలియని మరియు మీరు ఏదైనా పిన్ పాయింట్ చేసి అవతల వ్యక్తులకు చెప్పాలను కునే సందర్భాలలో మీ స్క్రీన్ ఎలా ఉన్నాదో అలాగే  ప్రింట్ తీసి, ఇమేజ్ గా సేవ్ చేసి వాళ్ళకి పంపించి ఈజీగా మీ పని ఫినిష్ చేయగలరు. జస్ట్ Function(fn) బటన్ మరియు PrtSc బటన్ రెండూ ఒకేసారి 1 sec ప్రెస్ చేసి, paint ను ఓపెన్ చేసి పేస్ట్ చేసి సేవ్ చేసి పంపించటమే.

కంప్యూటర్ టిప్స్ : మీకు తెలియని స్మాల్ థింగ్స్

Tab
1. టాబ్ బటన్ అనేది 5 సార్లు స్పేస్ బార్ ప్రెస్ చేస్తే వచ్చే రిజల్ట్ ఇస్తుంది డిఫాల్ట్ గా. అయితే ఇది డాక్యుమెంటేషన్ వర్క్స్ చేసే వారికి.

2. మీరు క్రోమ్ లేదా ఇతర బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు కొత్త టాబ్ లను ఓపెన్ చేయటానికి ఉపయోగం.

3. ఒక విండో లో ఉనప్పుడు ఒక దగ్గర నుండి వేరే దగ్గరకు వెళ్లాలన్నా ఉపయోగపడుతుంది. ఒకసారి మీరు కంప్యూటర్ లో ఎక్కడున్నా ఫర్వాలేదు దీనిని ప్రెస్ చేస్తూ ఇది ఎక్కడెక్కడి కర్సర్ ను ఎలా తీసుకువెల్తుందో చూడండి, అర్థమవుతుంది. కాని టాబ్ ప్రెస్ చేసిన తరువాత ఇది ఎక్కడుందో తెలియకుండా స్పేస్ బార్ లేదా enter బటన్ ను ప్రెస్ చేస్తే ట్యాబ్ ఎక్కడుందో అది యాక్టివేట్ అయిపోతుంది. For eg మీరు ఏదైనా సాఫ్ట్ వేర్ ఇంస్టాల్ చేస్తునప్పుడు టాబ్ ను ప్రెస్ చేస్తే అది cancel మీద వెళ్లినప్పుడు స్పేస్ లేదా enter ప్రెస్ చేస్తే ఇన్స్టాలేషన్ cancel అవుతుంది. మౌస్ పనిచేయని సందర్భాలలో టాబ్ ఈ కాంటెక్స్ట్ లో యూజ్ఫుల్ గా ఉంటుంది.
 

కంప్యూటర్ టిప్స్ : మీకు తెలియని స్మాల్ థింగ్స్

విండోస్ బటన్ తో కొన్ని రియల్ యూజ్ఫుల్ పనులు ఈజీగా చేసుకోగలరు.
1.Win+M ప్రెస్ చేస్తే మీరు వాడుతున్న అన్నీ విండోస్(బ్రౌజర్,వీడియో ప్లేయర్స్, మ్యూజిక్ ప్లేయర్స్, ఫోల్డర్స్, ఫైల్స్, ఇమేజెస్...అన్నీ) మినిమైజ్ అయ్యి డెస్క్టాప్ ను చూపిస్తుంది. సడెన్ గా ఎవరైనా వచ్చి మీ ప్రైవేట్ డేటా ను చూడకుండా ఇది బెస్ట్ యూజ్ఫుల్ టిప్.

2. Win+L ద్వారా మీరు మాటి మాటికి మీ సిస్టం వదిలి చిన్న చిన్న పనుల కోసం అక్కడ నుండి వెల్ల వలసి వస్తే ఈ బటన్స్ ప్రెస్ చేసి క్విక్ లాక్ చేసుకొని వెళ్లిపోవచ్చు.

3. అర్జెంటు గా సిస్టం ను షట్ డౌన్ చేయాలా? Win+U+U ప్రెస్ చేయండి. ఇంతకంటే ఫాస్ట్ గా సిస్టం ను షట్ డౌన్ చేయటం ఎవ్వరికీ తెలియదు. అయితే ఇది విండోస్ వెర్షన్ 8 నుండి వర్క్ చేయటం లేదు.

4. కంట్రోల్ బటన్ మోస్ట్ యూజ్ఫుల్ షార్ట్ కట్స్... "ctrl+s" - save, "ctrl+c" - copy, "ctrl+v" - paste, "ctrl+p" - print

కంప్యూటర్ టిప్స్ : మీకు తెలియని స్మాల్ థింగ్స్

Shift
1. మోస్ట్ యూజ్ఫుల్ షార్ట్ కట్. మీ సిస్టం లో ఫైల్స్ ను Recycle Bin లోకి వెళ్లకుండా పెర్మనెంట్ గా Delete చేయటానికి Shift+Delete ప్రెస్ చేయాలి.

2. కేవలం ఒక్క లెటర్ ను కేపిటల్ లెటర్ గా టైప్ చేయాలంటే షిఫ్ట్ బటన్ పట్టుకొని కావలసిన లెటర్ ను టైప్ చేస్తే అది కేపిటల్ లో టైప్ అవుతుంది.

3. Shift కీ ను పట్టుకొని Arrow బటన్స్ ను ప్రెస్ చేస్తే text సెలక్షన్ చేసుకోవటానికి అవుతుంది.

కంప్యూటర్ టిప్స్ : మీకు తెలియని స్మాల్ థింగ్స్

ESC
ఎప్పుడైనా ఎర్రర్ విండో క్లోజ్ చేయటానికి వీలు కుదరనప్పుడు esc బటన్ ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది విండో. అలాగే dailogue box ను కూడా ఫాస్ట్ గా సింపుల్ గా esc బటన్ ప్రెస్ చేసి క్లోజ్ చేయగలరు.

ఇలాంటి పనే చేయటానికి Alt+F4 బటన్ పనిచేస్తుంది. కాకపోతే ఇది కంప్లీట్ గా ఎటువంటి ఇబ్బందికరమైన విండోస్(బ్రౌజర్, ఫోల్డర్.. anything) ను క్లోజ్ చేస్తుంది. సిస్టం hang అయినప్పుడు ఇది బెస్ట్ యూజ్ఫుల్. 

కంప్యూటర్ టిప్స్ : మీకు తెలియని స్మాల్ థింగ్స్

Insert
ఇది కూడా బాగా తెలిసిన బటన్ కాని use ఏంటో తెలియదు. ఇది ఎక్కువుగా డాక్యుమెంటేషన్ వర్క్స్ కు ఉపయోగం. ఏదైనా టెక్స్ట్ టైపింగ్ లో వెన్నక్కి వెళ్లి దానిని మార్చేటప్పుడు నార్మల్ గా కర్సర్ ను కావలసిన దగ్గర పెట్టుకొని  new text ఎంటర్ చేసి వ్రాస్తాము.

insert బటన్ ప్రెస్ చేసి టైప్ చేస్తే మీరు కర్సర్ ప్లేస్ చేసినదగ్గర ఆ టెక్స్ట్ అంతా రిప్లేస్ అయ్యి new text టైప్ అవుతుంది. ఇది general users కు అంత ఉపయోగపడేది కాదు కాని దీని use ఏంటో మీకు తెలియటానికి చెప్పటం జరిగింది.

ఇక్కడున్న ఇమేజ్ లో మీరు రెడ్ సర్కిల్ గమనిస్తే బ్లాక్ బోల్డ్ cursor తో పైన ఉన్నది Insert బటన్ ప్రెస్ చేసిన తరువాతది. క్రిందది నార్మల్ మోడ్ లో ఉన్నప్పుడు.