ఒక్కొక్క టెక్ అప్ డేట్ కు ఒకొక్క సారి లింక్ ఓపెన్ చేసి చదివే ఓపిక ఉండదు అందరికీ. ఓపిక అని కాకపోయినా కొన్ని న్యూస్లలో ఓపెన్ చేసి చదవే అంత ఇంటరెస్ట్ సబ్జెక్ట్ ఉండదు. సో ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆ రోజు జరిగిన మేజర్ టెక్ అప్ డేట్స్ అన్నీ ఒకే చోట సింగిల్ లైన్ లో తెలపాలనే ఉద్దేశ్యంతో సింగిల్ లైన్ స్టోరి ను క్రియేట్ చేయటం జరిగింది.
Winfuture.de. వెబ్ సైట్ లో పాత సామ్సంగ్ గేలక్సీ J7 మొబైల్ డిజైన్ తోనే కనిపించే కొత్త J7(2016) ఇమేజెస్ లీక్ అయ్యాయి.
వాట్స్ అప్ తో పాటు ఇప్పుడు బ్లాక్ బెర్రీ కు ఫేస్ బుక్ కూడా మార్చ్ 21 నుండి ఉన్న ఫీచర్స్ ను డిసేబుల్ చేస్తూ లిమిటెడ్ ఫీచర్స్ తో mandatory అప్ డేట్ ఇస్తుంది.
బుక్ మై షో మూవీ టికెట్ బుకింగ్ సర్వీస్ లో ఇప్పుడు uber క్యాబ్ బుకింగ్ కూడా చేసుకొని థియేటర్ వద్దకు వెళ్ళగలరు.
బీహార్ లోని పోలిసల అందరికీ కమ్యునికేషన్ అవసరాలకు 2 కోట్ల పై ఖర్చు చేస్తూ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ ను ఇస్తుంది ప్రభుత్వం.