Intex iRist స్మార్ట్ వాచ్ లాంచ్

Updated on 16-Jul-2015
HIGHLIGHTS

3G సిమ్ కాలింగ్, WiFi

ఇంటెక్స్ తన మొదటి స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది నిన్న షాంఘై లో జరిగిన MWC ఈవెంట్  లో. ఇది ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ పై పనిచేస్తుంది. స్పెసిఫికేషన్స్ మంచిగా ఉన్నప్పటికీ ధర కొంచెం ఎక్కువుగా అనిపిస్తుంది.

iRist స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్స్ – 240 x 240 square డిస్ప్లే, 1.2GHz డ్యూయల్ కోర్ ప్రొసెసర్, 4GB స్టోరేజ్, 512MB ర్యామ్ (ఇది తక్కువుగా ఉంది అని అనుకోవద్దు, స్మార్ట్ వాచ్ కు ఇది సరిపోతుంది.) ఇది Standalone గా 3G సిమ్ వాయిస్ కాల్స్ ను సపోర్ట్ చేస్తుంది. అంటే ఆండ్రాయిడ్ ఫోనులోని సిమ్ కు అనుసంధానం అయ్యి పనిచేసేవి వచ్చాయి ఇంతవరకూ, ఇందులో నే సిమ్ ఉంటుంది, మీ దగ్గర ఫోన్ లేకపోయినా దీని నుండి కాల్ రిసీవింగ్ మరియు డయిలింగ్ చేసుకోగలరు. 

600 mah బ్యాటరీ ఉంది దీనిలో. ఇది 4 గంటలు టాక్ టైమ్ ఇస్తుంది. దీనిలోని మరో ప్రత్యేకత 5MP కెమేరా.  ఇంబిల్ట్ సిమ్, కీ బోర్డ్, మెసేజింగ్, వాయిస్ కమాండ్స్, Pedometer (steps ట్రాకర్), 32 GB sd కార్డ్ సపోర్ట్. బ్లూ టూత్ హెడ్ సెట్ తో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ లో WiFi, ప్లే స్టోర్ యాప్ కూడా ఉంది. బ్లాక్, ఆరెంజ్ పింక్ కలర్స్ లో వచ్చే దీనిలో అన్ని స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఉన్నాయి. బహుశా అందుకే కంపెని ధర కూడా ఆ ర్యాంజ్ లోనే ఫిక్స్ చేసింది.

Connect On :