ఇండియన్ మార్కెట్ కు 20,000 రూ స్టార్టింగ్ ప్రైస్ తో VU కొత్తగా 7 స్మార్ట్ టీవీ లను లాంచ్

ఇండియన్ మార్కెట్ కు 20,000 రూ స్టార్టింగ్ ప్రైస్ తో VU కొత్తగా 7 స్మార్ట్ టీవీ లను లాంచ్

VU స్మార్ట్ టీవీ బ్రాండ్ నుండి కొత్తగా CES లేటెస్ట్ టీవీ మోడల్స్ రిలీజ్ అయ్యాయి. Play సిరిస్ లో రెండు మోడల్స్ లాంచ్ అవగా, Iconium సిరిస్ లో 5 టీవీ లు లాంచ్ అయ్యాయి.

హై లైట్ ఏంటంటే స్టార్టింగ్ ధర 20,000 రూ నుండి ఉంది ప్లే సిరిస్ లో. Iconium సిరిస్ స్టార్టింగ్ ప్రైస్ 37,000 రూ. మరొక హై లైట్ నాలుగు మోడల్స్ కు ఇంబిల్ట్ టీవీ లో NetFlix ఉంది.

Netflix రీసెంట్ గా ఇండియాలో కూడా రిలీజ్ అవటం జరిగింది. మొదటి నెల ఫ్రీ, తరువాతి నెల నుండి 500 రూ package స్టార్ట్స్. NetFlix వీడియో లను చూపించే సర్వీస్.

Iconium సిరిస్ లో 40 in, 43 in, 50in, 55 in మరియు 65in వేరియంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆండ్రాయిడ్ os 4.4 వెర్షన్ తో వస్తున్నాయి.

VU లాస్ వేగాస్ లో జరిగిన CES లో అనౌన్స్ చేసినప్పటికీ ఇది మన ఇండియాలో ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ స్టోర్స్ లో కూడా బాగా సేల్స్ అవుతున్న బ్రాండ్.

ఫ్లిప్ కార్ట్ దీనికి ఎక్స్క్లూజీవ్ ఆన్ లైన్ పోర్టల్. వీటిలో ఉన్న ఫీచర్స్.. 4K డిస్ప్లే, డిజిటల్ dBX, ఇంటెలిజెంట్ ఆడియో స్మార్ట్ ఫీచర్స్, సోషల్ మీడియా, gesture గేమింగ్ కంట్రోల్స్.

ప్లే సిరిస్ లో 32 in 48 in స్క్రీన్ మోడల్స్ ఉన్నాయి. ఓవర్ ఆల్ గా అన్ని టీవీ లు ఫ్లిప్ కార్ట్ ద్వారా మాత్రమే సేల్స్ జరగనున్నాయి.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo