Galaxy Watch 7 మరియు Watch Ultra వచ్చేసాయి..ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

Galaxy Watch 7 మరియు Watch Ultra వచ్చేసాయి..ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
HIGHLIGHTS

Galaxy Watch 7 మరియు Watch Ultra స్మార్ట్ వాచ్ లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది

చాలా ఫీచర్స్ తో ఈ కొత్త వాచ్ లను విడుదల చేసింది

టైటానియం గ్రేడ్ 4 ఫినిష్ మరియు 10ATM వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ ఇందులో వుంది

Samsung ఈరోజు Galaxy Watch 7 మరియు Watch Ultra స్మార్ట్ వాచ్ లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్ వాచ్ లను టైటానియం గ్రేడ్ 4 ఫినిష్ మరియు 10ATM వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ వంటి చాలా ఫీచర్స్ తో ఈ కొత్త వాచ్ లను విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్ వాచ్ ధర మరియు ఫీచర్లు వివరంగా చూద్దామా.

Galaxy Watch 7 మరియు Watch Ultra: ధర

గెలాక్సీ వాచ్ 7 స్మార్ట్ వాచ్ బేసిక్ వేరియంట్ ను రూ. 29,999 ధరతో విడుదల చేసింది. అయితే, గెలాక్సీ వాచ్ అల్ట్రా స్మార్ట్ వాచ్ ను రూ. 59,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ వాచ్ లు కూడా రోజు నుండే ప్రీ ఆర్డర్స్ కి అందుబాటులోకి వచ్చాయి.

Also Read: Galaxy Buds 3 మరియు Buds 3 Pro లాంచ్ చేసిన శామ్సంగ్: ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

Galaxy Watch 7 మరియు Watch Ultra: ఫీచర్లు

గెలాక్సీ వాచ్ 7 స్మార్ట్ వాచ్ 480 x 480 1.5 ఇంచ్ సూపర్ AMOLED స్క్రీన్ మరియు 480 x 480 రిజల్యూషన్ 1.3 ఇంచ్ సూపర్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మరియు సూపర్ బ్రైట్నెస్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ Exynos W1000 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB మెమరీ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ Wear OS 5 పైన నడుస్తుంది. ఈ వాచ్ లో స్లీప్ అనాలసిస్ కోసం AI అల్గారిథం ను జత చేసింది. ఇది రియల్ టైం హార్ట్ మోనిటరింగ్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ECG) మరియు BP మోనిటరింగ్ ఫీచర్ లను కలిగి వుంది. అడ్వాన్స్ మరియు ఇన్ డెప్త్ మోనిటరింగ్ కోసం ఈ వాచ్ లో BioActive Sensor వుంది.

Samsung Galaxy Watch 7 and Watch Ultra
Samsung Galaxy Watch 7 and Watch Ultra

ఇక వాచ్ అల్ట్రా స్మార్ట్ వాచ్ విషయానికి వస్తే, ఈ వాచ్ ను అడ్వాన్స్డ్ హెల్త్ మోనిటరింగ్ మరియు పవర్ ఫుల్ హార్డ్ వేర్ తో అందించింది. ఈ స్మార్ట్ వాచ్ ను టైటానియం గ్రేడ్ 4 ఫినిష్ మరియు 10ATM వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తో అందించింది. ఇది వాచ్ నెక్స్ట్ లెవెల్ డ్యూరబిలిటీని సూచిస్తుంది. వాచ్ అల్ట్రా 100 వర్క్ అవుట్ లను యాక్యురేట్ గా ట్రాక్ చేస్తుంది. ఈ వాచ్ 480 x 480 1.5 ఇంచ్ సూపర్ AMOLED స్క్రీన్ ను 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo