Redmi Watch 5 Lite: AMOLED స్క్రీన్ మరియు స్టైలిష్ డిజైన్ తో బడ్జెట్ ధరలో వచ్చింది.!
Redmi Watch 5 Lite స్మార్ట్ వాచ్ ను మార్కెట్లో విడుదల చేసింది
ఈ కొత్త స్మార్ట్ వాచ్ ను AMOLED స్క్రీన్ మరియు స్టైలిష్ డిజైన్ తో బడ్జెట్ ధరలో తీసుకు వచ్చింది
ఈ స్మార్ట్ వాచ్ ను ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది
Redmi Watch 5 Lite: షియోమీ ఈరోజు రెడ్ మీ వాచ్ 5 లైట్ స్మార్ట్ వాచ్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్ వాచ్ ను AMOLED స్క్రీన్ మరియు స్టైలిష్ డిజైన్ తో బడ్జెట్ ధరలో తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ ను ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. షియోమీ సరికొత్తగా లాంచ్ చేసిన ఈ స్మార్ట్ వాచ్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.
Redmi Watch 5 Lite: ధర
రెడ్ మీ వాచ్ 5 లైట్ స్మార్ట్ వాచ్ ను కేవలం రూ. 3,299 ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ మరియు mi.com నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది. ఈ వాచ్ బ్లాక్ మరియు లైట్ గోల్డ్ రెండు కలర్స్ లో లభిస్తుంది.
Redmi Watch 5 Lite: ఫీచర్స్
రెడ్ మీ వాచ్ 5 లైట్ స్మార్ట్ వాచ్ ను 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 410 x 502 రిజల్యూషన్ కలిగిన 1.96 ఇంచ్ AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ రెడ్ మీ వాచ్ షియోమీ యొక్క లేటెస్ట్ Xiaomi HyperOS పై పని చేస్తుంది. ఈ వాచ్ 200 కి పైగా క్లౌడ్ వాచ్ ఫేసెస్ లను కలిగి వుంది. ఇందులో 50 కి పైగా కస్టమైజబుల్ మరియు 30 కి పైగా AOD స్క్రీన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ Mi Fitness App (Xiaomi Wear) యాప్ సపోర్ట్ వస్తుంది.
ఈ కొత్త రెడ్ మీ వాచ్ Alexa Built In మరియు Emojis సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ వాచ్ ఎన్ హెన్డ్స్ Five-System GPS తో వస్తుంది. ఈ వాచ్ లో హార్ట్ రేట్ సెన్సార్, యాక్సిలెరో మీటర్ సెన్సార్ మరియు జైరో స్కోప్ సెన్సార్ లు కూడా ఉన్నాయి. ఈ వాచ్ లో 160 కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్, కాలింగ్ కోసం 2Mic ENC, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ మరియు 5 ATM IP Rating ఫీచర్స్ కూడా ఉన్నాయి.
Also Read: Amazon GIF Sale జబర్దస్త్ ఆఫర్లు: భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న 32 ఇంచ్ Smart Tv డీల్స్ ఇవే.!
రెడ్ మీ వాచ్ 5 లైట్ స్మార్ట్ వాచ్ లో ఎమర్జెన్సీ SOS కాల్ సపోర్ట్, 30 ఎంట్రీ వరకు కాల్ హిస్టరీ మరియు ఫేవరెట్ కాంటాక్ట్ వంటి ఫీచర్లు కూడా అందించింది.