Redmi Watch 5 Lite స్మార్ట్ వాచ్ లాంచ్ డేట్ ను షియోమీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ వాచ్ ను ఇన్ బిల్ట్ GPS మరియు AMOLED స్క్రీన్ వంటి మరిన్ని ఫీచర్స్ తో తీసుకువస్తున్నట్లు కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ షియోమీ స్మార్ట్ వాచ్ ఎటువంటి ఫీచర్స్ తో వస్తుంది మరియు ఈ వాచ్ డిజైన్ ఎలా ఉందో ఒక లుక్కేయండి.
రెడ్ మీ వాచ్ 5 లైట్ స్మార్ట్ వాచ్ సెప్టెంబర్ 25 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ వాచ్ కీలకమైన ఫీచర్ ను కూడా లాంచ్ డేట్ తో పాటు రెడ్ మీ అనౌన్స్ చేసింది.
రెడ్ మీ వాచ్ 5 లైట్ స్మార్ట్ వాచ్ ను 1.96 ఇంచ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ చేస్తున్నట్లు షియోమీ తెలిపింది. ఈ స్మార్ట్ వాచ్ లో అందించిన ఈ స్క్రీన్ వైబ్రాంట్ కలర్స్ ను అందిస్తుందని కూడా తెలిపింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ వాచ్ లో ఇన్ బిల్ట్ GPS తో వస్తుంది. ఇది స్మార్ట్ ఫోన్ లేని సమయంలో ట్రాక్ చేయడానికి లేదా ఎక్కడైనా మిమల్ని ట్రాక్ చెస్ అవకాశం అందిస్తుంది.
రెడ్ మీ వాచ్ 5 లైట్ HyperOS తో వస్తుంది. ఇది వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ మరియు క్లియర్ కాలింగ్ ఫీచర్ తో వస్తుంది. అంటే, ఈ స్మార్ట్ వాచ్ రన్నింగ్ సమయాల్లో కూడా మంచి కాలింగ్ అవకాశం అందిస్తుంది. ఈ రెడ్ మీ అప్ కమింగ్ వాచ్ 5ATM 50 మీటర్స్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఇది స్విమ్ ట్రాక్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఫీచర్స్ చూస్తుంటే షియోమీ ఈ వాచ్ ను ఆల్ రౌండర్ ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
Also Read: Samsung Galaxy M55s 5G బడ్జెట్ ధరలో ఆకట్టుకునే డిజైన్ మరియు ఫీచర్స్ తో వచ్చింది.!