రియల్‌మీ యొక్క రెండవ పునరావృత బడ్జెట్ వేరబుల్, Realme Band 2 త్వరలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. రియల్‌మీ బ్యాండ్ యొక్క ఫస్ట్ జెనరేషన్ చాలా దూకుడు ధరతో వచ్చింది. ఇది మొదటి సారిగా వేరబుల్ కొనుగోలు చేసేవారికి మంచి పోటీ ఎంపికగా నిలిచింది. వాస్తవానికి, ఇది మి బ్యాండ్ 5 కు అపోజిట్ గా పెరిగింది, ఇది మొదటి మి బ్యాండ్ నుండి ఈ విభాగంలో చాలావరకు ఆధిపత్యం చెలాయించింది. రియల్‌మీ బ్యాండ్ 2 యొక్క ఎక్స్ క్లూజివ్ రెండర్‌లతో పాటు 360-డిగ్రీల డిజైన్ పొందడానికి డిజిట్ OnLeaks తో భాగస్వామ్యం కలిగి ఉంది.
https://twitter.com/OnLeaks/status/1416427077767684110?ref_src=twsrc%5Etfw
రాబోయే వేరబుల్ గురించి మీకు మొదటి నుండే మంచి లుక్ ఇవ్వడానికి వీలైన రియల్‌మే బ్యాండ్ 2 యొక్క కొన్ని హై-రిజల్యూషన్ రెండర్‌లను మేము మా చేతుల్లో సంపాదించగలిగాము. మేము 360-డిగ్రీల వీడియోను కూడా దీనికి జోడించాము, ఇది రాబోయే డివైజ్ నుండి మీరు ఏమి ఆశించవచ్చునో పూర్తి రూపాన్ని ఇస్తుంది.
ఇమేజెస్ నుండి చూస్తే, రియల్‌మీ యొక్క రియల్‌మీ బ్యాండ్ 2 ను ఒరిజినల్ రియల్‌మీ బ్యాండ్ కంటే ఎక్కువ ప్రీమియంలా కనిపించే ఆఫర్‌గా మార్చాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. రాబోయే డివైజ్, బ్యాండ్ వలె కనిపించే ఫస్ట్ వేరబుల్ మాదిరిగాకాకుండా వాచ్ లాగా కనిపిస్తుంది. స్ట్రాప్స్ కలపడానికి బదులుగా డిస్ప్లే మరియు కేసు మరింతగా కలగలసి ఉంటాయి.
హై రిజల్యూషన్ ఇమేజెస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
స్టీల్ హేమెర్‌స్టాఫర్, అకా ఆన్‌లీక్స్, డిస్ప్లే గురించి మాట్లాడుతూ, రియల్‌మీ బ్యాండ్ 2 సుమారు 1.4-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంటుందని పేర్కొంన్నారు. ఇది మొదటి రియల్‌మీ బ్యాండ్‌లో కనిపించే 0.96-అంగుళాల డిస్ప్లే నుండి చాలా పెద్ద మార్పు. బహుశా రియల్‌మీ ప్రీమియం రూపానికి ఇది ఖచ్చితంగా జోడించాలని చేసినట్లుంది. డిస్ప్లే దిగువన టచ్ బటన్ ఉన్నట్లు కనిపించడం లేదని కూడా గమనించాలి. రియల్‌మీ బ్యాండ్ 2 లోని UI పూర్తిగా టచ్ మరియు జెశ్చర్ ఆధారంగా ఉంటుందని ఇది సూచిస్తుంది. ఈ ప్రైస్ విభాగంలోని చాలా డివైజెస్ ఇప్పుడు ఇలాంటి UI ని అందిస్తున్నందున ఇది ఎక్కువ ఆశ్చర్యం కలిగించదు.
హై రిజల్యూషన్ ఇమేజెస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కొలతల పరంగా, రియల్‌మీ బ్యాండ్ 2 సుమారు 45.9 x 24.6 x 12.1 మి.మీ.ని మెజర్మెంట్స్ తో ఉంటుందని ఆన్‌లీక్స్ పేర్కొంది. ఇది ఈ డివైజ్ ను ఫస్ట్ వేరబుల్ కంటే పెద్దదిగా చేస్తుంది, కానీ ధరించేటప్పుడు అది పెద్దగా ఉండకూడదు.
హై రిజల్యూషన్ ఇమేజెస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వెనుకవైపు, ఈ పరికరం సాధారణ ఆప్టికల్ సెన్సార్లను కలిగి ఉన్నట్లు మనం చూడవచ్చు. ఇవి 24×7 హార్ట్ రేట్ పర్యవేక్షణ వంటి ఫీచర్లను అనుమతించాలి. అయితే, ఇవి SpO2 ట్రాకింగ్ మరియు బ్లడ్ ప్రెజర్ పర్యవేక్షణను కూడా అందిస్తాయో లేదో ఇంకా తెలియదు. మనం ఈ ఫీచర్ల గురించి తెలుసుకోవడానికి వేచి ఉండాలి. గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే, మొదటి రియల్‌మీ బ్యాండ్ ఒక పట్టీని తీసివేసి నేరుగా USB పోర్టులోకి ప్లగ్ చేయడం ద్వారా ఛార్జ్ చేయబడుతుంది. ఏదేమైనా, కొత్త పట్టీ డిజైన్ దీనికి అనుమతించకపోవడాన్ని చూడవచ్చు. అందుకని, కొత్త రియల్‌మీ బ్యాండ్ 2 పోగో పిన్స్ ద్వారా లేదా అలాంటి మరోక విధంగా ఛార్జింగ్ చేస్తుందని ఉహించవచ్చు.
రియల్‌మీ బ్యాండ్ 2 ఎప్పుడు అధికారికంగా ఆవిష్కరించబడుతుందో ఇంకా ధృవీకరించబడలేదు, కాని అది లేటుకాకుండా త్వరగా ఉండాలి. ఈ వేరబుల్ ఇటీవలే బ్లూటూత్ SIG లిస్టింగ్ పేజీలలో RMW 2010 మోడల్ నంబర్‌ను కలిగి ఉంది. రియల్‌మీ బ్యాండ్ 2 బ్లూటూత్ v5.1 ను అందిస్తుందని ఇది చాలా క్లీన్ గా ధృవీకరించింది. ప్రస్తుత రియల్‌మీ బ్యాండ్ బ్లూటూత్ v4.2 ను అందిస్తుందని పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా పెద్ద దశే అవుతుంది.