New Smart Watch Launched: పెద్ద డిస్ప్లేతో కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ చేసిన Promate.!

Updated on 26-Feb-2024
HIGHLIGHTS

Promate ఈరోజు ఇండియన్ మార్కెట్ లో కొత్త స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది

ఈ స్మార్ట్ వాచ్ పెద్ద 2.01 ఇంచ్ డిస్ప్లే మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో వచ్చింది

XWatch-B2 పేరుతో వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ వాచ్

New Smart Watch Launched: ప్రముఖ గ్లోబల్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాడ్ Promate ఈరోజు ఇండియన్ మార్కెట్ లో కొత్త స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. XWatch-B2 పేరుతో తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ పెద్ద 2.01 ఇంచ్ డిస్ప్లే మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో వచ్చింది. ప్రోమేట్ సరికొత్తగా లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Promate New Smart Watch Launched:

ప్రోమేట్ సరికొత్తగా ఈరోజు విడుదల చేసిన XWatch-B2 ధర విషయానికి వస్తే, ఈ స్మార్ట్ వాచ్ ను Rs. 2499 ధరతో లాంచ్ చేసింది మరియు ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు నుండే అమేజాన్ ద్వారా సేల్ కి అందులోకి కూడా వచ్చింది. Buy From Here

Also Read : Jio Diwali Offer: ఈ రీఛార్జ్ చేస్తే 23 రోజుల వ్యాలిడిటీ మరియు డేటా ఉచితం.!

ప్రోమేట్ XWatch-B2 స్పెక్స్ మరియు ఫీచర్స్

ఈ ప్రోమేట్ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ పెద్ద 2.01 ఇంచ్ TFT HD (240×296) డిస్ప్లేని 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి వుంది. ఈ స్మార్ట్ వాచ్ మంచి డిజైన్ మరియు క్రిస్టల్ క్లియర్ డిస్ప్లేతో వచ్చినట్లు ప్రోమేట్ తెలిపింది. ఈ స్మార్ట్ వాచ్ Blue, Black మరియు Graphite కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ వాచ్ Bluetooth 5.2 సపోర్ట్ తో మరియు ఇన్ బిల్ట్ స్పీకర్ తో మంచి కాలింగ్ అవకాశం అందిస్తుంది.

ప్రోమేట్ స్మార్ట్ వాచ్

ఈ స్మార్ట్ వాచ్ సైకిలింగ్, రన్నింగ్ మరియు యోగా వంటి 123+ డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్స్ లను కలిగి వుంది. యూజర్లు ఎప్పటి కప్పుడు కొత్త వాచ్ ఫేస్ లతో ఆకట్టుకునేలా చేసేందుకు వీలుగా ఈ స్మార్ట్ వాచ్ ను 200+ వాచ్ ఫేస్ లను కూడా ఉన్నట్లు ప్రోమేట్ తెలిపింది. ఈ స్మార్ట్ వాచ్ IP67 Water Proof తో వస్తుంది మరియు రియల్ టైమ్ హార్ట్ రేట్ మోనిటర్ కూడా అందిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :