OnePlus Watch 2: వన్ ప్లస్ బ్రాండ్ నుండి మిలటరీ గ్రేడ్ మన్నికతో కొత్త రగ్డ్ స్మార్ట్ వాచ్ వస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ లాంఛ్ గురించి కంపెనీ డేట్ మరియు టీజర్ ఇమేజ్ లను కూడా విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ను గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇది మాత్రమే కాదు ఈ వన్ ప్లస్ స్మార్ట్ వాచ్ కోసం ఇండియాలో Pre – Reserve బెనిఫిట్స్ ను కూడా లాంఛ్ కంటే ముందే అనౌన్స్ చేసింది. ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ వాచ్ ను MWC 2024 నుండి ఆవిష్కరిస్తునట్లు వన్ ప్లస్ తెలిపింది.
వన్ ప్లస్ వాచ్ 2 రగ్డ్ స్మార్ట్ వాచ్ ను భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి 8:30 నిముషాలకు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2024) నుండి ఆవిష్కరించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఇప్పటికే కంపెనీ వెబ్సైట్ నుండి టీజింగ్ పేజ్ తో టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది.
ఈ స్మార్ట్ వాచ్ కోసం వన్ ప్లస్ Pre – Reserve Exclusive Benefits ప్రోగ్రామ్ ను కూడా అనౌన్స్ చేసింది. ఈ కార్యక్రమం ద్వారా ఈ స్మార్ట్ వాచ్ ను కేవలం రూ. 99 రూపాయల ధరకే ముందుగా బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న యూజర్లు రూ. 1,000 తగ్గింపును ఈ వాచ్ కొనుగోలు పైన అందుకోవచ్చ. అంతేకాదు, Bullets Wireless Z2 ANC సెట్ ను ఉచితంగా పొందవచ్చని కూడా వన్ ప్లస్ తెలిపింది.
Also Read: Honor Magic 6 Series: అదరగొట్టే కెమేరాతో లాంఛ్ కాబోతున్న హానర్ ఫోన్.!
ఈ అప్ కమింగ్ స్మార్ట్ వాచ్ ను మంచి ఫిట్ మరియు స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో ఉన్నట్లు టీజింగ్ ఇమేజ్ ద్వారా అర్ధమవుతోంది. ఈ స్మార్ట్ వాచ్ యొక్క ఫీచర్స్ ను డైరెక్ట్ గా కంపెనీ ఇంకా తెలియ చెయ్యలేదు. కానీ, టీజర్ వీడియో ద్వారా ఈ ఫోన్ అత్యంత కఠినమైన మరియు పరిస్థితులు, వేడి మరియు చల్లని వాతారవరణ పరిస్థుతలను తట్టుకుంటుందని చూపిస్తోంది. వాస్తవానికి, ఈ వాచ్ మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ కలిగిన రగ్డ్ స్మార్ట్ వాచ్ అని వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది. ఇందులో, రొటేటింగ్ క్రౌన్ మరియు స్టైలిష్ బటన్ ఉన్నట్లు కూడా మనం చూడవచ్చు.