నోయిస్ బ్రాండ్ నుండి 4జి కాలింగ్ స్మార్ట్ వాచ్ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. అదే, NoiseFit Voyage 4G eSIM స్మార్ట్ వాచ్ మరియు ఈ వాచ్ ను Airtel మరియు Jio ఇ-సిమ్ సపోర్ట్ తో లాంచ్ చేసింది. ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ ఎటువంటి స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండా కాలింగ్, మెసేజ్ లతో పాటుగా మరిన్ని పనులను సొంతంగా నిర్వహించ గలదు. ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా.
నోయిస్ ఫిట్ వాయేజ్ 4జి ఇసిమ్ స్మార్ట్ వాచ్ ను కంపెనీ రూ. 10,999 ధరతో లంచ్ ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ కంపెనీ అధికారిక వైబ్సైట్ gonoise.com నుండి లభిస్తోంది. ఈ స్మార్ వాచ్ ను RUPAY క్రెడిట్ కార్డ్ ద్వారా కొనే వారికి రూ. 1,500 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది.
Also Read : JIO NEW YEAR OFFER 2024: అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ అందించిన జియో.!
నోయిస్ ఫిట్ వాయేజ్ 4జి ఇసిమ్ స్మార్ట్ వాచ్ 1.4 ఇంచ్ రెటీనా AMOLED డిస్ప్లేని 454 x 454 రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ నోయిస్ స్మార్ వాచ్ IP68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది మరియు 100+ Sports మోడ్ లను Auto sports detection తో కలిగి ఉంటుంది. ఇది ఆటో హార్ట్ రేట్ మోనిటర్, ఆటో SpO2 మోనిటర్, ఆటో స్లీప్ ట్రాకర్, ఆటో స్ట్రెస్ మేజర్ మెంట్ మరియు మరిన్ని ఫీచర్లను కలిగి వుంది.
ఇది eSIM సపోర్ట్ వస్తుంది మరియు 200 వరకూ కాంటాక్ట్స్ లిస్ట్ ను కూడా ఆఫర్ చేస్తుంది. ఈ వాచ్ లో Call rejection, Vibration alert మరియు DND మోడ్ కూడా ఉన్నాయి. నోయిస్ ఫిట్ వాయేజ్ 4జి ఇసిమ్ స్మార్ట్ వాచ్ లో BT V5.3 సపోర్ట్, బ్లూటూత్ కాలింగ్ మరియు కాలర్ పేరుతో కూడిన TWS connectivity వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.