NoiseFit Origin స్మార్ట్ వాచ్ ను కంపెనీ ఇండియాలో విడుదల చేసింది.ఈ స్మార్ట్ వాచ్ ను కొత్త UI, డిజైన్ మరియు ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ను వాటర్ రెసిస్టెంట్ మరియు కొత్త రకం AMOLED డిస్ప్లే వంటి ఫీచర్స్ తో తీసుకు వచ్చింది. మార్కెట్ లో విడుదలైన ఈ నోయిస్ కొత్త స్మార్ట్ వాచ్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
నోయిస్ ఈ కొత్త స్మార్ట్ వాచ్ ని రూ. 6,499 ధరతో మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ Amazon మరియు gonoise.com నుండి సేల్ కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ పైన మంచి ఆఫర్లను కూడా అందించింది. అమెజాన్ నుండి ఈ స్మార్ట్ వాచ్ ను HDFC Bank Debit Card ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల వరకూ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
నోయిస్ యెక్క ఈ కొత్త స్మార్ట్ వాచ్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. ఇది గట్టి మరియు మన్నికైన డిజైన్ తో అందించబడింది. ఈ స్మార్ట్ వాచ్ 1.46 ఇంచ్ రౌండ్ స్క్రీన్ తో ఉంటుంది మరియు ఇది లేటెస్ట్ Apex Vision AMOLED స్క్రీన్ తో ఉంటుంది. ఈ డిస్ప్లే 466 x 466 రిజల్యూషన్ తో మరియు క్లౌడ్ బేస్ వాచ్ ఫెసెస్ సపోర్ట్ తో ఉంటుంది.
ఈ నోయిస్ కొత్త స్మార్ట్ వాచ్ మంచి పెర్ఫార్మెన్స్ అందించగల కొత్త EN 1 ప్రోసెసర్ తో వచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ కొత్త Nebula UI పైన పని చేస్తుంది. అంతేకాదు, పాత UI కి మరియు ఈ కొత్త UI కి చాలా వ్యతాసం ఉన్నట్లు కూడా కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ వాచ్ లో ఫంక్షనల్ క్రౌన్ మరియు మ్యాగ్నెటిక్ క్లాస్ప్ కూడా వుంది. ఈ కొత్త వాచ్ వేగవంతమైన ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 7 రోజుల వాడుక వినియోగాన్ని అందించే బ్యాటరీతో ఉంటుంది.
Also Read: Jio Second Phone Days సేల్ నుంచి జియో ఫోన్ల పై అమెజాన్ జబర్దస్త్ ఆఫర్లు.!
ఈ నోయిస్ వాచ్ హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, SpO2, స్లీప్ మోనిటర్, స్ట్రెస్ మోనిటర్ మరియు ఫీమేల్ సైకిల్ టాక్ ట్రాకర్ వంటి మరిన్ని ఫీచర్ లను కలిగి ఉన్నట్లు నోయిస్ తెలిపింది. ఇందులో, కాల్ నేమ్ ఇన్ఫర్మేషన్, కాల్ రిజక్షన్, AI వాయిస్ అసిస్టెంట్, టైమర్, కాలిక్యులేటర్, వెథర్ వంటి మరిన్ని స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.