Noise Halo 2: ఫంక్షనల్ రొటేటింగ్ డయల్ తో ఫస్ట్ స్మార్ట్ వాచ్ లాంచ్ చేసిన నోయిస్.!
భారత మార్కెట్లో నోయిస్ సరికొత్త Noise Halo 2 స్మార్ట్ వాచ్ లాంచ్ చేసింది
ఫంక్షనల్ రొటేటింగ్ డయల్ తో ఈ వాచ్ ను లాంచ్ చేసింది
ఈ స్మార్ట్ వాచ్ AMOLED స్క్రీన్ మరియు మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది
Noise Halo 2: భారత మార్కెట్లో నోయిస్ సరికొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ చేసింది. ఎన్నడూ లేని విధంగా ఫంక్షనల్ రొటేటింగ్ డయల్ తో ఈ వాచ్ ను లాంచ్ చేసింది. నోయిస్ హేలో పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ వాచ్ AMOLED స్క్రీన్ మరియు మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది.
Noise Halo 2: ప్రైస్
నోయిస్ హేలో స్మార్ట్ వాచ్ ను రూ. 4,499 ధరతో అందించింది. ఈ స్మార్ట్ వాచ్ ను అమెజాన్ ఇండియా మరియు noise అధికారిక వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది.
Noise Halo 2: ఫీచర్లు
నోయిస్ ఈ కొత్త స్మార్ట్ వాచ్ ను 1.43 ఇంచ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఈ స్క్రీన్ 466 x 466 రిజల్యూషన్ తో పాటు గొప్ప బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ స్క్రీన్ పైన ఒక ఫంక్షనల్ రొటేటింగ్ డయల్ ను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ తో ఈ ఫోన్ మరొక మీరు ఎక్కించింది. ఈ రొటేటింగ్ డయల్ తిప్పితూ ఈ వాచ్ యొక్క మెనూ మరియు ఫంక్షన్ లను ఆపరేట్ చేయవచ్చు.
ఈ నోయిస్ కొత్త స్మార్ట్ వాచ్ IP67 రేటింగ్ వస్తుంది. ఈ వాచ్ Call రిజెక్షన్, స్టాప్ వాచ్, కాలర్ నేమ్ ఇన్ఫర్మేషన్, వెథర్, DND, ఫంక్షనల్ క్రౌన్ మరియు రిమైండర్ వంటి స్మార్ట్ ఫీచర్ లను కలిగి వుంది. ఈ స్మార్ట్ వాచ్ iOS 11.0 + లేదా Android 9.0 + డివైజ్ లకు సపోర్ట్ చేస్తుంది మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 తో వస్తుంది.
ఈ స్మార్ట్ వాచ్ లో Heart rate sensor, Accelerometer మరియు SpO2 sensor లు ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ NoiseFit APP సపోర్ట్ తో వస్తుంది మరియు కంప్లీట్ హెల్త్ కంట్రోల్ అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ మెటల్ ఫ్రేమ్, స్టెయిన్ లెస్ స్టీల్ సిలికాన్ మరియు లెథర్ స్ట్రాప్స్ ను కలిగి ఉంటుంది.