Airtel Payments Bank డైరెక్ట్ పేమెంట్స్ ఫీచర్స్ తో Noise సారధ్యంలో కొత్త Smart Watch వచ్చింది.!

Updated on 20-Mar-2024
HIGHLIGHTS

Airtel Payments Bank డైరెక్ట్ పేమెంట్స్ ఫీచర్ తో కొత్త Smart Watch వచ్చింది

ఈ వాచ్ ఎయిర్టెల్ పెమెంట్స్ బ్యాంక్ Tap & Pay ఫీచర్ తో ఉంటుంది

పేమెంట్ చెయ్యాలంటే సింపుల్ గా ట్యాప్ అండ్ పే చేస్తే సరిపోతుంది

Airtel Payments Bank డైరెక్ట్ పేమెంట్స్ ఫీచర్స్ తో Noise సారధ్యంలో కొత్త Smart Watch వచ్చింది. ఇప్పటి వరకూ కేవలం టైం చూడటానికి లేదా స్మార్ట్ ఫీచర్స్ తో హెల్త్ అప్డేట్ లను అందుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది. అయితే, ఇప్పుడు నోయిస్ మరియు ఎయిర్టెల్ భాగస్వామ్యంతో వచ్చిన కొత్త స్మార్ట్ వాచ్ అంతకు మించి పని చేస్తుందని నిరూపిస్తుంది.

Airtel Payments Bank Smart Watch

ఎయిర్టెల్ పెమెంట్స్ బ్యాంక్ తో నేరుగా పెమెంట్స్ చేయగల ఫీచర కలిగిన కొత్త స్మార్ట్ వాచ్ ను నోయిస్ సహకారంతో తీసుకు వచ్చింది. ఈ ఎయిర్టెల్ – నోయిస్ స్మార్ట్ వాచ్ ఎయిర్టెల్ పెమెంట్స్ బ్యాంక్ Tap & Pay ఫీచర్ తో ఉంటుంది. ఎక్కడైనా పేమెంట్ చెయ్యాలంటే సింపుల్ గా ట్యాప్ అండ్ పే చేస్తే సరిపోతుంది.

Noise Airtel Payments Bank smart watch

ఈ స్మార్ట్ వాచ్ కేవలం పెమెంట్ ఫీచర్ ను మాత్రమే కాకుండా మరిన్ని ఫీచర్స్ ను కూడా కలిగి వుంది. ఈ వాచ్ 130 స్పోర్ట్స్ మోడ్స్, 24×7 హార్ట్ రేట్, SpO2 & stress మోనిటర్ వంటి కంప్లీట్ హెల్త్ సూట్ సపోర్ట్ ని కలిగి ఉంటుంది. అలాగే, 150+ cloud-based వాచ్ ఫేస్ లను మరియు BT calling కూడా ఈ స్మార్ట్ వాచ్ కలిగి ఉంటుంది.

Also Read: Vivo T3 5G: Sony OIS కెమేరాతో రేపు విడుదల కాబోతున్న వివో టర్బో ఫోన్.!

ఈ Noise Airtel Smart Watch ధర ఎంత?

ఈ కొత్త స్మార్ట్ వాచ్ ను రూ. 2,999 ధరతో ప్రకటించింది. అయితే, ఈ వాచ్ ను నేరుగా కొనుగోలు చేసే అవకాశం లేదు. ఈ వాచ్ ను కొనడానికి Airtel Thanks APP లోకి వెళ్లి Airtel Payment Bank Smartwatch పైన నొక్కాలి. తరువాత, ఇక్కడ అడిగిన వివరాలను అందించి పేమెంట్ చెయ్యాలి. ఈ వాచ్ ను ఎయిర్టెల్ థాంక్స్ యాప్ తో మేనేజ్ చేయవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :