విరాట్ కోహ్లీ తో సహా క్రికెటర్స్ ధరించిన ఈ WHOOP Fitness band గురించి మీకు తెలుసా? డోంట్ వర్రీ, ఈరోజు ఈ ప్రత్యేకమైన ఫిట్ నెస్ బ్యాండ్ గురించి తెలుసుకుందాం. వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీతో సహా చాలా మంది ప్లేయర్స్ చేతికి ఒక ఫిట్ నెస్ బ్యాండ్ ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు. అయితే, ఈరోజు ఈ ఫిట్ నెస్ బ్యాండ్ ఏమిటి, ఎందుకు ఈ ఫిట్ నెస్ బ్యాండ్ ను ధరిస్తున్నారు అని తెలుసుకుందాం.
వాస్తవానికి, ప్రముఖ క్రికెటర్స్ తో పాటుగా చాలా మంది సెలబ్రేటిస్ ఈ ఫిట్ నెస్ బ్యాండ్ ను ధరిస్తున్నారు. ఇక ఈ ఫిట్ నెస్ బ్యాండ్ విషయానికి వస్తే, దీని పేరు WHOOP ఫిట్ నెస్ బ్యాండ్ మరియు ఇది 2015 లోనే మొదటిగా మార్కెట్ లోకి అడుగు పెట్టింది. అయితే, తరువాత కొంత విరామం తీసుకొన్న ఇప్పుడు 2021 నుండి లేటెస్ట్ 4.0 వెర్షన్ తో మార్కెట్ లో అడుగు పెట్టింది.
అంతేకాదు, ఈ WHOOP ఫిట్ నెస్ బ్యాండ్ వన్ నెల నెల మెంబర్ షిప్ లేదా వన్ ఇయర్ మెంబర్ షిప్ తో వస్తుంది. WHOOP 4.0 BAND లేటెస్ట్ బ్యాండ్ వన్ ఇయర్ సబ్ స్క్రిప్షన్ కోసం $239 డాలర్లు ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే, ఈ ఫిట్ నెస్ బ్యాండ్ ఇప్పటికీ ఇండియన్ మార్కెట్ లో లభించడం లేదు. ఇది USA మార్కెట్ లో లభిస్తుంది మరియు అక్కడి అమేజాన్ ఆన్లైన్ ప్లాట్ ఫామ్ ద్వారా కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Also Read : AI Voice Scam: ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త స్కామ్ | Tech News
అసలు ఎందుకు ఈ ఫిట్ నెస్ బ్యాండ్ అంటే అంత క్రేజ్? అని అనుకుంటున్నారా. అవును ఇదంటే చాలా మంది అథ్లెట్స్ మరియు ఫిట్ నెస్ ప్రియులు అమితంగా ఇష్టపడతారు. ఎందుకంటే, ఇతర ఫిట్ నెస్ బ్యాండ్ లతో పోలిస్తే ఈ బ్యాండ్ అత్యంత ఖచ్చితమైన పెర్ఫార్మెన్స్ ట్రాకింగ్ అందిస్తుంది.
ఈ బ్యాండ్ మీ రోజువారీ డేటాని అనాలిసిస్ చేసి నెక్ట్స్ మీరు ఏమి చెయ్యాలో కూడా అంచనా వేసి చెబుతుంది. అందుకే, ఈ బ్యాండ్ ఇతర బ్యాండ్స్ కంటే యూనిక్ గా ఉండేలా చేసింది. మరి ముఖ్యంగా ఈ ఫిట్ నెస్ బ్యాండ్ ను ఛార్జ్ చేయడానికి కూడా తియ్యాల్సిన పని ఉండదు. కాబట్టి, 24/7 హెల్త్ ట్రాక్ కోసం సరైన ఎంపిక అవుతుంది.
అందుకే, విరాట్ కోహ్లీ , సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ మరియు శ్రేయాస్ అయ్యర్ వంటి క్రికెటర్స్ బాహాటంగానే ఈ ఫిట్ నెస్ బ్యాండ్ ను ధరిస్తున్నారు. అయితే, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ బ్యాండ్ ఇంకా ఇండియన్ మార్కెట్ లో లాంచ్ కూడా అవ్వలేదు.