itel Unicorn: పెండెంట్ Smart Watch ను తెచ్చిన ఐటెల్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
ఐటెల్ బ్రాండ్ నుండి కొత్త ప్రోడక్ట్ భారత్ మార్కెట్ లో అడుగుపెట్టింది
Smart Watch వినియోగానికి అనుగుణంగా కొత్త వాచ్ ను తెచ్చింది
itel Unicorn పేరుతో తెచ్చిన ఈ కొత్త స్మార్ట్ వాచ్ 2 ఇన్ వన్ ఫీచర్ తో వచ్చింది
ఐటెల్ బ్రాండ్ నుండి కొత్త ప్రోడక్ట్ భారత్ మార్కెట్ లో అడుగుపెట్టింది. దేశంలో పెరుగుతున్న Smart Watch వినియోగానికి అనుగుణంగా కొత్త వాచ్ ను తెచ్చింది. ఇందులో కొట్టే ముందే అనుకోకండి, ఈ స్మార్ట్ వాచ్ చేతికి వాచ్ లాగా మరియు మెడలో పెండెంట్ లాగా కూడా ఉపయోగించవచ్చు. itel Unicorn పేరుతో తెచ్చిన ఈ కొత్త స్మార్ట్ వాచ్ ఈ 2 ఇన్ వన్ ఫీచర్ తో వచ్చింది.
itel Unicorn Price
ఐటెల్ యునికార్న్ స్మార్ట్ వాచ్ ను రూ. 2,599 రూపాయల ధరతో అందించింది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ ఇండియా నుండి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ ను అధునాతన ఫీచర్స్ తీసుకు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. Buy From Here
itel Unicorn Smart Watch: ఫీచర్స్
ఐటెల్ యునికార్న్ స్మార్ట్ వాచ్ ను మణికట్టుకు పెట్టుకునే వాచ్ మరియు మెడలో ధరించే పెండెంట్ మాదిరిగా కూడా ఉపయోగించవచ్చు. ఈ విధంగా పని చేసేలా వినూత్నమైన డిజైన్ తో వచ్చిన మొదటి స్మార్ట్ వాచ్ కూడా ఇదే అవుతుంది.
ఈ ఐకూ స్మార్ట్ వాచ్ 1.43 ఇంచ్ AMOLED రౌండ్ డిస్ప్లే తో ఉంటుంది మరియు ఇది 500నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ వాచ్ Single chip BT కాలింగ్ మరియు రొటేటింగ్ క్రౌన్ వంటి ఉపయోగకరమైన ఫీచర్స్ కలిగి వుంది. ఈ వాచ్ IP68 వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
ఇక ఈ వాచ్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ వాచ్ లో 200+ వాచ్ ఫేసెస్ మరియు 110 స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ వాచ్ మెటాలిక్ బిల్డ్ తో వస్తుంది మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి వుంది.
Also Read: 18 లక్షల Mobile Number లను తొలగించనున్న ప్రభుత్వం.. ఎందుకంటే.!
ఈ స్మార్ట్ వాచ్ 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, సెడెంటరీ రిమైండర్, స్లీప్ మోనిటర్ మరియు SpO2 మోనిటరింగ్ వంటి ఫీచర్స్ తో వస్తుంది.
సంప్రదాయ స్మార్ట్ వాచ్ నుండి ఈ స్మార్ట్ వాచ్ ను సెపరేట్ చేయడానికి వీలుగా కంపెనీ ఈ వాచ్ ను పెండెంట్ మాదిరిగా మార్చుకునే సౌలభ్యంతో అందించింది.