ఆండ్రాయిడ్ Smartwatch లకు అందుబాటులోకి వచ్చిన Truecaller App

Updated on 30-Aug-2024
HIGHLIGHTS

ruecaller App ఇప్పుడు ఆండ్రాయిడ్ smartwatch లకు అందుబాటులోకి వచ్చింది

ఈ యాప్ ను నేరుగా స్మార్ట్ వాచ్ అల్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు

స్మార్ట్ వాచ్ ల కోసం ట్రూకాలర్ యాప్ ను రీసెంట్ గా ప్రకటించింది

మొబైల్ ఫోన్ లలో కాలర్ ఐడెంటిఫికేషన్ కోసం అత్యంత ప్రాచుర్యం పొందిన కాలర్ ఐడి యాప్ Truecaller App ఇప్పుడు ఆండ్రాయిడ్ smartwatch లకు అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ను నేరుగా స్మార్ట్ వాచ్ అల్లో డౌన్ లోడ్ చేసుకొని ఉపయోగించవచ్చని ట్రూకాలర్ ప్రకటించింది. ఈ యాప్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మరియు స్మార్ట్ వాచ్ లో ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకోండి.

Truecaller App For Smartwatch

ఆండ్రాయిడ్ Wear OS తో పని చేసే స్మార్ట్ వాచ్ ల కోసం ట్రూకాలర్ యాప్ ను రీసెంట్ గా ప్రకటించింది. ఈ యాప్ ను నేరుగా డౌన్ లోడ్ చేసుకొని స్మార్ట్ వాచ్ లలో ఉపయోగించుకోవచ్చు. అంటే, స్మార్ట్ వాచ్ తో పని లేకుండా నేరుగా మీ స్మార్ట్ వాచ్ లోనే మీ ఫోన్ చేసే వారి ఐడెంటిఫికేషన్ ను చూడవచ్చు.

Truecaller App ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

స్మార్ట్ వాచ్ కోసం ట్రూకాలర్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో ‘Truecaller’ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఈ యాప్ ను కనుగొన్న తర్వాత Install చేసుకోవాలి.

ఈ Smartwatch లకు సపోర్ట్ చేస్తుంది?

ట్రూకాలర్ యాప్ Android Wear OS తో పని చేసే Fossil, Samsung మరియు మరిన్ని స్మార్ట్ వాచ్ లలో పని చేస్తుంది.

Also Read: ఈరోజు రూ. 700 ధరలో Myntra ఆఫర్ చేస్తున్న బెస్ట్ వైర్డ్ ఇయర్ ఫోన్ మరియు బడ్స్ డీల్స్.!

ఫోన్ లో ఉన్న ట్రూకాలర్ ఆండ్రాయిడ్ యాప్ తో ఎలా ఇన్స్టాల్ చేయాలి?

దీనికోసం ముందుగా మీ ఫోన్ లో ఉన్న ట్రూకాలర్ ఆండ్రాయిడ్ యాప్ ను ఓపెన్ చేయాలి. ఈ యాప్ లో యూజర్ ప్రొఫైల్ లోకి వెళ్లి ‘Truecaller for Wear’ ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. ఇలా సెలక్ట్ చేయగానే స్మార్ట్ వాచ్ లిస్ట్ తో ఉన్న కొత్త వాచ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డివైజ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. వెంటనే మీ స్మార్ట్ వాచ్ లో ఇన్స్టాల్ బటన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసి ఈ యాప్ ను మీ స్మార్ట్ వాచ్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :