ప్రముఖ స్మార్ట్ వాచ్ బ్రాండ్ ఫైర్ – బోల్ట్ నుండి మరొక స్మార్ట్ వాచ్ ఇండియన్ మార్కెట్ అడుగుపెట్టింది. అదే, Fire-Boltt Royale Smart Watch మరియు ఈ స్మార్ట్ వాచ్ 4GB మ్యూజిక్ స్టోరేజ్ తో అకట్టుకుంటుంది. ఈ కొత్త స్మార్ట్ వాచ్ పేరుకు తగ్గట్టుగానే రాయల్ గా కనిపిస్తుంది మరియు రాయల్ ఫీచర్స్ తో కూడా వస్తుంది. ఫైర్ – బోల్ట్ సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ధర మరియు ఈ వాచ్ ఫీచర్స్ తెలుసుకుందాం.
ఫైర్ – బోల్ట్ కొత్త స్మార్ట్ వాచ్ రాయల్ ను రూ. 4,999 లాంచ్ ప్రైస్ తో మార్కెట్ లో విడుదల చేసింది. వాస్తవానికి, ఈ స్మార్ట్ వాచ్ ను నవంబర్ 25 వ తేదీ విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంతేకాదు, ఫైర్ – బోల్ట్ అధికారిక వెబ్సైట్ నుండి పూర్తి వివరాలతో టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది.
Also Read : Facebook మరియు Instagram కోసం AI ఆధారిత వీడియో ఎడిటింగ్ ఫీచర్ తెచ్చిన Meta.!
ఇక ఫైర్ – బోల్ట్ రాయల్ స్మార్ట్ వాచ్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇది 466×466 హై రిజల్యూషన్ అందించ గల 1.43 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 750 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కూడా vas వస్తుంది. అంటే, ఈ వాచ్ లో అద్భుతమైన కలర్స్ ను హై బ్రైట్నెస్ లో ఆస్వాదించవచ్చు. ఈ వాచ్ గొప్ప డిజైన్ మరియు ఫీచర్స్ ను కలిగి వుంది. ఇందులో టచ్ కంట్రోల్స్ పాటుగా 3 కంట్రోల్ బటన్స్ కూడా ఉన్నాయి. ఇవి మరింత అందమైన లుక్ తో పాటుగా ఈజీ కంట్రోల్ కోసం కూడా అనువైనవిగా ఉంటాయి. ఇందులో లగ్జరి పుష్ బటన్ కూడా వుంది.
ఈ స్మార్ట్ వాచ్ వాయిస్ అసిస్టెంట్ తో వస్తుంది మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ వాచ్ లో 300+ స్పోర్ట్స్ మోడ్స్ మరియు 130+ ఇన్ బిల్ట్ వాచ్ ఫేస్ లను కూడా అందించింది. ఈ వాచ్ 380 mAh బ్యాటరీ, ఫైర్ బోల్ట్ హెల్త్ సూట్, క్యాలికులెటర్, ఫైండ్ ఫోన్ కెమేరా కంట్రోలర్ మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
ఫైర్ బోల్ట్ రాయల్ స్మార్ట్ వాచ్ 5 అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ పూర్తిగా మెటల్ తో డిజైన్ చెయ్యబడింది.