ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీదారు Fire-Boltt సరికొత్త కఠినమైన స్మార్ట్ వాచ్ (Rugged Smart Watch) ను విడుదల చేసింది. ఫైర్ బోల్ట్ కోబ్రా పేరుతో తీసుకువచ్చిన ఈ స్మార్ట్ వాచ్ IP68 రేటింగ్ తో అత్యంత కఠినమైన పరిస్థితులను కూడా తట్టుకోగలదని కంపెనీ తెలిపింది. ఈ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ AMOLED డిస్ప్లే వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ చూద్దాం పదండి.
ఫైర్ బోల్ట్ కోబ్రా స్మార్ట్ వాచ్ ను కంపెనీ రూ.3,499 రూపాయల ధరతో లాంచ్ చేసింది. అయితే, ఇది లాంచ్ అఫర్ లో భాగంగా ప్రకటించింది మరియు రేటులో మార్పు జరిగే అవకాశం ఉండవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ను Flipkart మరియు కంపెనీ వెబ్సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.
ఇక ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ Fire-Boltt Cobra స్మార్ట్ వాచ్ 1.78 ఇంచ్ AMOLED డిస్ప్లేని 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే ఆల్వేస్-ఆన్ ఫెసిలిటీ మరియు 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఇది కఠినమైన పరిస్థితులను తట్టునేలా మెటల్ ఫ్రెమ్ ను కలిగి వుంటుంది. డస్ట్, నీటి తుంపర్లు మరియు వొత్తిడిని వంటి ఛాలెంజింగ్ మరియు ఎన్విరాన్మెంటల్ పరిస్థితుల పైన నిర్వహించిన అనేక పరీక్షలను ఈ స్మార్ట్ వాచ్ దాటుకొని వచ్చినట్లు కంపెనీ తెలిపింది.
ఫైర్ బోల్ట్ కోబ్రా స్మార్ట్ వాచ్ 123 స్పోర్ట్ మోడ్స్, బ్లూటూత్ కాలింగ్ (డయల్ ప్యాడ్), 24/7 హార్ట్ రేట్ మోనిటరింగ్,SpO2 ట్రాకింగ్, వాయిస్ అసిస్టెంట్ పెరియాడికల్ హెల్త్ రిమైండర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 15 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది మరియు బ్యాటరీ సేవర్ మోడ్ పైన 30 రోజుల వరకూ బ్యాటరీ లైఫ్ అందించగలదని కంపెనీ తెలిపింది.