బడ్జెట్ ధరలో లగ్జరీ Smart Watch ను లాంచ్ చేసిన ఫైర్ బోల్ట్.!

బడ్జెట్ ధరలో లగ్జరీ Smart Watch ను లాంచ్ చేసిన ఫైర్ బోల్ట్.!
HIGHLIGHTS

ఫైర్ బోల్ట్ నుండి కొత్త Smart Watch వచ్చింది

బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్స్ మరియు ఫీచర్స్ తో లాంచ్

రోటెనింగ్ క్రౌన్ మరియు మోషన్ గేమింగ్ ఫీచర్ తో లాంచ్

ఇండియన్ మార్కెట్ లో మంచి స్మార్ట్ వాచ్ బ్రాండ్ గా పేరొందిన ఫైర్ బోల్ట్ నుండి కొత్త స్మార్ట్ వాచ్ వచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ ను బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్స్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేసినట్లుగా ఫైర్ బోల్ట్ చెబుతోంది. ఎందుకంటే, ఈ స్మార్ట్ వాచ్ లగ్జరీ రాయల్ స్టెయిన్ లెస్ డిజైన్, రోటెనింగ్ క్రౌన్ మరియు మోషన్ గేమింగ్ ఫీచర్ వంటి మరిన్ని ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

Fire-Boltt Royale Smart Watch

Fire-Boltt Royale పేరుతో ఫైర్ బోల్ట్ సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ బడ్జెట్ లగ్జరీ స్మార్ట్ వాచ్ రూ. 4,999 స్పెషల్ లాంచ్ ధరతో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశించింది. ఈ స్మార్ట్ వాచ్ ఫైర్ బోల్ట్ అధికారిక వెబ్సైట్ మరియు అమేజాన్ ఇండియా నుండి లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ పైన ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ఫైర్ బోల్ట్ ఆఫర్ చేస్తోంది. Buy From Amazon

Also Read : చవక ధరలో AI-ENC Earbuds వచ్చేశాయి.. ధర ఎంతంటే.!

ఫైర్ -బోల్ట్ రాయల్ స్మార్ట్ వాచ్ ప్రత్యేకతలు

ఈ ఫైర్ -బోల్ట్ రాయల్ స్మార్ట్ వాచ్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ వాచ్ ను లగ్జరీ డిజైన్ మరియు ఫీచర్స్ తో తీసుకు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఫైర్ బోల్ట్ రాయల్ లో 1.43 ఇంచ్ AMOLED డిస్ప్లే 750 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి వుంది. ఈ వాచ్ లో 4GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది. ఈ స్మార్ట్ వాచ్ 5 అందమైన లగ్జరీ కలర్ ఆప్షన్ లలో కూడా లభిస్తుంది.

Fire Boltt Royale smart Watch
ఫైర్ -బోల్ట్ రాయల్ స్మార్ట్ వాచ్

రాయల్ స్మార్ట్ వాచ్ రొటేటింగ్ క్రౌన్, బ్లూటూత్ కాలింగ్, హార్ట్ మోనిటర్, SpO2 మరియు స్లీప్ మోనిటర్ ఫీచర్స్ తో కూడా వస్తుంది. ఇందులో మోషన్ గేమింగ్ కంట్రోలింగ్ సపోర్ట్ ను కూడా ఫైర్ బోల్ట్ అందించింది. ఇందులో, వాయిస్ అసిస్టెంట్, 300+ స్పోర్ట్స్ మోడ్స్, 130+ బిల్ట్ ఇన్ వాచ్ ఫేస్ లు, 380mAh బ్యాటరీ మరియు ఫైర్ బోల్ట్ హెల్త్ సూట్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఓవరాల్ గా స్మార్ట్ వాచ్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఇది చూడటానికి లగ్జరీ వాచ్ మాదిరిగా కనిపించే స్మార్ట్ వాచ్. అంతేకాదు, ఇది ఆల్ రౌండ్ ఫీచర్లతో బడ్జెట్ ధరలో వచ్చిన లగ్జరీ స్మార్ట్ వాచ్ అని కూడా చెప్పవచ్చు.

అయితే, ఇవ్వని కూడా స్మార్ట్ వాచ్ ఇమేజ్ లు మరియు స్పెక్స్ ఆధారంగా మాత్రమే చెప్పడమైనది. ఈ వాచ్ రివ్యూ తరువాత పెర్ఫార్మెన్స్ మరియు పూర్తి వివరాలను అందించగలము.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo