Fire-Boltt Dream: 4G LTE సిమ్ కార్డ్ తో పనిచేసే స్మార్ట్ వాచ్ వచ్చేసింది.!
4G LTE సిమ్ కార్డ్ తో పనిచేసే స్మార్ట్ వాచ్ వచ్చేసింది
ఈ స్మార్ట్ వాచ్ 4G LTE నానో SIM కార్డ్ తో పని చేస్తుంది
Fire-Boltt Dream Wrist Phone పేరుతో వచ్చిన ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్
ఇప్పటి వరకూ కేవలం ఫోన్ తో కనెక్ట్ చేసే స్మార్ట్ వాచ్ లను మాత్రమే మీరు చూసి ఉంటారు. అయితే, ప్రముఖ స్మార్ట్ వాచ్ బ్రాండ్ ఫైర్ బోల్ట్ 4G LTE సిమ్ కార్డ్ తో పనిచేసే స్మార్ట్ వాచ్ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. Fire-Boltt Dream Wrist Phone పేరుతో వచ్చిన ఈ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ లో సిమ్ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ పేరుకు (wrist Phone) తగ్గట్టుగానే మణికట్టు ఫోనులుగా పని చేస్తుంది.
Fire-Boltt Dream 4G LTE స్మార్ట్ వాచ్
ఫైర్ బోల్ట్ సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ 4G LTE నానో SIM కార్డ్ తో పని చేస్తుంది. మార్కెట్ లో ఇప్పటికే eSIM సపోర్ట్ తో కొత్త స్మార్ట్ వాచ్ లు లాంచ్ అవ్వగా, ఇప్పుడు ఫైర్ బోల్ట్ ఏకంగా సిమ్ కార్డ్ తో పని చేసే స్మార్ట్ వాచ్ నే లాంచ్ చేసింది. ఫైర్ బోల్ట్ ఈ స్మార్ట్ వాచ్ ను కేవలం రూ. 5,999 రూపాయల ఆకర్షణీయమైన ధరలో లాంచ్ చేసింది.
ఈ స్మార్ట్ వాచ్ జనవరి 10 వ తేదీ మధ్యాహ్నం నుండి Flipkart మరియు Fire-Boltt అధికారిక వెబ్సైట్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read : ఇండియాలో Xiaomi Hyper OS తో వచ్చే మొదటి ఫోన్ Poco X6 Pro.!
ఫైర్ బోల్ట్ డ్రీమ్ 4జి సిమ్ వాచ్ ప్రత్యేకతలు
ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ వాచ్ 2.02 ఇంచ్ IPS HD రౌండ్ డయల్ స్క్రీన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ 4జి సిమ్ కార్డ్ మరియు Wi-Fi కనెక్టివిటీతో కూడా వస్తుంది. ఈ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ లో క్వాడ్ కోర్ ప్రోసెసర్ ను 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది. ఈ స్మార్ట్ వాచ్ IP67 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.
ఈ స్మార్ట్ వాచ్ Android OS పైన పని చేస్తుంది మరియు గూగుల్ ప్లే స్టోర్ నుండి మీకు నచ్చిన యాప్ లను డౌన్ లోడ్ చేసుకొనే వీలు కూడా వుంది. ఈ స్మార్ట్ వాచ్ తో డైరెక్ట్ గా వీడియోలు, వాట్సాప్, Uber, గూగుల్ మ్యాప్స్, ఇలా ఒకటేమిటి ఒక స్మార్ట్ ఫోన్ చేసే అన్ని పనులను నేరుగా మీ రిస్ట్ వాచ్ లోనే అందుకోవచ్చని ఫైర్ బోల్ట్ చెబుతోంది.