Fastrack Xtreme Pro: AMOLED డిస్ప్లే మరియు రగ్డ్ డిజైన్ తో కొత్త Smart Watch లాంచ్.!

Updated on 17-May-2024
HIGHLIGHTS

ఫాస్ట్ ట్రాక్ కొత్త Smart Watch ను మార్కెట్లో విడుదల చేసింది

Fastrack Xtreme Pro పేరుతో రగ్డ్ డిజైన్ వంటి మరిన్ని ఫీచర్స్ తో తెచ్చింది

ఈ ఫోన్ ను అతి తక్కువ EMI ఆఫర్ తో కూడా కొనుగోలు చేసే వీలుంది

ప్రముఖ వాచ్ బ్రాండ్ ఫాస్ట్ ట్రాక్ కొత్త Smart Watch ను మార్కెట్లో విడుదల చేసింది. Fastrack Xtreme Pro పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ వాచ్ AMOLED డిస్ప్లే మరియు రగ్డ్ డిజైన్ వంటి మరిన్ని ఫీచర్స్ తో వచ్చింది. ఈ కొత్త వాచ్ ప్రైస్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.

Fastrack Xtreme Pro Smart Watch: ప్రైస్

ఫాస్ట్ ట్రాక్ ఎక్స్ ట్రీమ్ ప్రో స్మార్ట్ వాచ్ ను రూ. 3,999 ప్రైస్ ట్యాగ్ తో మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ fastrack.in నుండి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. ఈ ఫోన్ ను అతి తక్కువ EMI ఆఫర్ తో కూడా కొనుగోలు చేసే వీలుంది.

Fastrack Xtreme Pro ఫీచర్లు ఎలా ఉన్నాయి?

ఫాస్ట్ ట్రాక్ ఎక్స్ ట్రీమ్ ప్రో స్మార్ట్ వాచ్ ను 1.43 ఇంచ్ AMOLED డిస్ప్లే తో అందించింది. ఈ డిస్ప్లే 466 x 466 రిజల్యూషన్ తో వస్తుంది మరియు ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. ఈ కొత్త స్మార్ట్ వాచ్ ను Rugged Design తో ఫాస్ట్ ట్రాక్ తీసుకు వచ్చింది.

Fastrack Xtreme Pro

ఈ స్మార్ట్ వాచ్ ATS చిప్ సెట్ మరియు లేటెస్ట్ BTv 5.3 సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇది సీమ్ లెస్ బ్లూటూత్ కనెక్టివిటీ ఆ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో 100+ స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్ మరియు ఆటో మల్టీ స్పోర్ట్స్ రికగ్నైజేషన్ ఫీచర్ కూడా వుంది.

Also Read: 24GB RAM మరియు ఫాస్ట్ ప్రోసెసర్ తో వస్తున్న Infinix GT 20 Pro ఫోన్.!

ఈ వాచ్ 300 mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో బిల్ట్ ఇన్ క్యాలిక్యులేటర్, బిల్ట్ ఇన్ గేమ్స్ AI వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా వుంది. ఈ వాచ్ IP68 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ తో గట్టిగా ఉంటుంది. ఈ ఫాస్ట్ ట్రాక్ స్మార్ట్ వాచ్ 12 Months వారంటీతో వస్తుంది.

ఇక ముఖ్యమైన ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ వాచ్ ఫంక్షనల్ క్రౌన్, Beige Strap మరియు ఫాస్ట్ ట్రాక్ స్మార్ట్ వరల్డ్ యాప్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ వాచ్ SOS Calling, Calendar, Event Reminder, Low Power Mode వంటి ఫీచర్స్ ను కూడా కలిగి వుంది.

ఈ వాచ్ లో ఆటో స్ట్రెస్ మోనిటర్, SpO2, 24×7 హార్ట్ రేట్ మోనిటర్, స్లీప్ మోనిటర్ మరియు ఉమెన్ హెల్త్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :