boAt Storm Call 3: మ్యాప్ నావిగేషన్ ఫీచర్ తో కొత్త స్మార్ట్ వాచ్ తెచ్చిన బోట్.!
బోట్ ఇండియాలో సరికొత్త స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది
boAt Storm Call 3 ను కొత్త మ్యాప్ నావిగేషన్ ఫీచర్ తో తీసుకు వచ్చింది
ఈ స్మార్ట్ వాచ్ మూడు అందమైన కలర్ మరియు మెటల్ స్ట్రాప్ తో కూడా లభిస్తుంది
boAt Storm Call 3: ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్ బ్రాండ్ బోట్ ఇండియాలో సరికొత్త స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది. బోట్ స్టోర్మ్ కాల్ 3 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ వాచ్ ను కొత్త మ్యాప్ నావిగేషన్ ఫీచర్ తో తీసుకు వచ్చింది. అంతేకాదు, స్మార్ట్ వాచ్ మరిన్ని ఫీచర్లను కూడా కలిగి ఉంది. బోట్ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ వివరాలేమిటో తెలుసుకుందామా.
boAt Storm Call 3: Price
బోట్ స్టోర్మ్ కాల్ 3 స్మార్ట్ వాచ్ ను రూ. 1,499 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ మూడు అందమైన కలర్ మరియు మెటల్ స్ట్రాప్ తో కూడా లభిస్తుంది.
boAt Storm Call 3: ప్రత్యేకతలు
ఈ కొత్త బోట్ స్మార్ట్ వాచ్ నావిగేషన్ ఫీచర్ తో మీ సిటీ నావిగేషన్ ను మీ చేతి మాణికట్టులోనే చూడవచ్చు. boAt crest app లో మీకు కావాల్సిన లొకేషన్ ను అందించడం ద్వారా ఈ స్మార్ట్ వాచ్ లో మ్యాప్ వివరాలను అందుకుంటారు. అయితే, కేవలం ఒకసారి ఒక లొకేషన్ మ్యాప్ వివరాలను మాత్రమే ట్రాక్ చేసే వీలుంటుంది.
ఈ స్మార్ట్ వాచ్ లో కొత్త QR Code Tray ఫీచర్ ను కూడా బోట్ జత చేసింది. ఈ ఫీచర్ తో 5 QR codes వరకు సేవ్ చేసుకొని మీ షోషల్ మీడియా ప్రొఫైల్, ఐడెంటిటీ కార్డ్, పేమెంట్స్ అందుకోవడం, మూవీ షోలు, ట్రావెల్ టికెట్స్ మరియు మరిన్ని వాటికీ ఉపయోగించవచ్చు.
Also Read: Samsung Galaxy C55: లెథర్ బ్యాక్ తో కొత్త ఫోన్ లాంఛ్ చేసిన సాంసంగ్.!
ఈ వాచ్ లో ఉన్న DIY Watch Face Studio ద్వారా కావాల్సిన వాచ్ ఫేస్ లను మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ 1.83 ఇంచ్ బిగ్ HD డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్, డయల్ ప్యాడ్, Mic, స్పీకర్ మరియు కాంటాక్ట్ సేవ్ చేసుకునే అవకాశం కలిగి ఉంటుంది.
ఈ బోట్ కొత్త స్మార్ట్ వాచ్ Heart Rate, SpO2 మరియు G-sensor లను కలిగి ఉంటుంది. ఈ వాచ్ Text, Call and Social media నోటిఫికేషన్ లను కూడా అందిస్తుంది. ఈ వాచ్ 100 పైగా Sports Modes లకు సపోర్ట్ చేస్తుంది.