Apple Watch 10 Series: పెద్ద స్క్రీన్ మరియు స్లీక్ డిజైన్ తో వచ్చింది.!
ఈవెంట్ ఇట్స్ గ్లో టైం నుంచి కొత్త ప్రోడక్ట్స్ ను లాంచ్ చేసింది
ఈ లాంచ్ ఈవెంట్ నుంచి పెద్ద స్క్రీన్ మరియు స్లీక్ డిజైన్ తో ఆపిల్ వాచ్ 10 ని లాంచ్ చేసింది
ఈ స్మార్ట్ వాచ్ లను అల్యుమినియం బాడీ మరియు పెద్ద స్క్రీన్ తో పాటు అందించింది
Apple Watch 10 : ఈరోజు జరిగిన యాపిల్ 2024 లాంచ్ ఈవెంట్ ఇట్స్ గ్లో టైం నుంచి కొత్త ప్రోడక్ట్స్ ను లాంచ్ చేసింది. ఈ లాంచ్ ఈవెంట్ నుంచి పెద్ద స్క్రీన్ మరియు స్లీక్ డిజైన్ తో ఆపిల్ వాచ్ 10 ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ లను అల్యుమినియం బాడీ మరియు పెద్ద స్క్రీన్ తో పాటు అందించింది. యాపిల్ సరికొత్తగా విడుదల చేసిన ఈ వాచ్ 10 సిరీస్ వాచ్ కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.
Apple Watch 10 Series : ఫీచర్స్
యాపిల్ వాచ్ 10 సిరీస్ ను గత వాచ్ సిరీస్ లతో పోలిస్తే 30% బిగ్ స్క్రీన్ తో అందించింది. అంతేకాదు, ఈ స్క్రీన్ అధిక బ్రైట్నెస్ మరియు రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ఇన్ బిల్ట్ స్పీకర్ ను కలిగి ఉంటుంది మరియు ఈ స్పీకర్ నుంచి మ్యూజిక్ మరియు ఇతర ఫైల్స్ ను నేరుగా ప్లే చేసి మంచి సౌండ్ తో వినే అవకాశం అందించింది.
ఈ వాచ్ 10 సిరీస్ ను S10 చిప్ సెట్ తో అందించింది. ఈ స్మార్ట్ వాచ్ అండర్ వాటర్, సర్ఫింగ్, వాటర్ మ్యాపింగ్ మరియు మరిన్ని యాక్టివిటీ లతో వస్తుంది. ఈ సిరీస్ ను అల్యునియం బాడీ వాచ్ లతో పాటు టైటానియం బాడీ వాచ్ ను కూడా అందించింది. ఈ వాచ్ గ్లాసి లుక్ మరియు కఠినమైనదిగా ఉంటుంది.
Also Read: 20 వేలకే 43 ఇంచ్ 4K QLED స్మార్ట్ టీవీ అందుకునే సువర్ణావకాశం.!
Apple Watch 10 Series : ప్రైస్
ఆపిల్ వాచ్ 10 సిరీస్ ను $399 (సుమారు రూ.33,500) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ యాపిల్ వాచ్ సిరీస్ సెప్టెంబర్ 20 వ తేదీ నుంచి ప్రపంచ మార్కెట్ లో సేల్ కి అందుబాటులోకి వస్తుంది.