యాపిల్ నిన్న నిర్వహించిన కార్యక్రమం నుండి ఐఫోన్ 14 సిరీస్ తో పాటుగా Apple Watch లను కూడా ప్రకటించింది. కొత్తగా Apple Watch Ultra, Series 8 మరియు SE లను ఇండియాలో విడుదల చేసింది. వీటిలో, యాపిల్ వాచ్ అల్ట్రా కఠినమైన పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడగలిగిన రగ్డ్ స్మార్ట్ వాచ్. ఈ యాపిల్ వాచ్ ను టైటానియం బిల్డ్ మరియు సఫైర్ గ్లాస్ రక్షణలో ఉంచిన రెటీనా డిస్ప్లేతో అందించింది. భారత్ లో యాపిల్ ప్రవేశపట్టిన ఈ కొత్త యాపిల్ వాచ్ విశేషాలు ఏమిటో చూద్దాం పదండి.
ఇప్పటి వరకూ వచ్చిన యాపిల్ వాచ్ లలో ఇది అత్యంత కఠినమైన పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడగల మొదటిది అని యాపిల్ ఈ ఫోన్ గురించి చెబుతోంది. ఈ వాచ్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS, టైటానియం కేస్ మరియు ప్రత్యేకమైన స్ట్రాప్స్ తో అన్ని రకాలైన అట్లెట్స్ మరియు అడ్వెంచరర్స్ కు అనువైనదని కూడా కంపెనీ చెబుతోంది. ఇది సాధారణ వాడకంతో 36 గంటల లైఫ్ టైం అందిస్తుంది. ఈ యాపిల్ వాచ్ -20 డిగ్రీల నుండి 55 డిగ్రీల వరకూ టెంపరేచర్ ను తట్టుకోగలదు. ఇందులో, టెంపరేచర్ సెన్సింగ్, ECG, స్లీప్ ట్రాకింగ్ మరియు బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ మోనిటరింగ్ వంటి చాల ఫీచర్లు వున్నాయి.
ఇలా చెప్పుకుంటూపోతే ఈ యాపిల్ వాచ్ అల్ట్రా గుట్టల కొద్దీ ఫీచర్లను తనలో ఇముడ్చుకుంది. ఈ యాపిల్ తన పేరు మరియు ఫీచర్లకు తగ్గట్టుగానే ధరను కూడా పలుకుతుంది. Apple Watch Ultra ను యాపిల్ రూ.89,900 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ యాపిల్ వాచ్ ఆర్డర్స్ మొదలయ్యాయి మరియు సెప్టెంబర్ 23 నుండి అందుబాటులోకి వస్తుంది.
ఇక యాపిల్ Series 8 మరియు SE స్మార్ట్ వాచ్ ల విషయానికి వస్తే, SE తక్కువ ధరలో వచ్చే వాచ్ కాగా వాచ్ సిరీస్ 8 మాత్రం బాగానే ధర పలుకుతుంది. ఈ రెండు యాపిల్ వాచ్ లు కూడా 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించగల ఆల్వేస్ ఆన్ రెటీనా డిస్ప్లే తో వస్తాయి. వీటిలో, Series 8 బ్లడ్ ఆక్సిజన్, ECG మరియు టెంపరేచర్ సెన్సింగ్ లతో వస్తుంది. కానీ, SE స్మార్ట్ వాచ్ లో మాత్రం ఈ ఫీచర్లు ఉండవు. అయితే, సైకిల్ ట్రాకింగ్, SOS ఫాల్ డిటెక్షన్, క్రాష్ డిటెక్షన్ తో పటు ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ కాలింగ్ వంటి సౌకర్యాలు ఇతర రెండు ఫోన్ల మాదిరిగా కలిగి ఉంటుంది.
ఇక ఈ రెండు యాపిల్ వాచ్ ల ధరల విషయానికి వస్తే, Series 8 స్మార్ట్ వాచ్ ధర రూ.45,900 మరియు SE యాపిల్ వాచ్ ధర రూ. 29,900. ఈ రెండు యాపిల్ వాచ్ ఆర్డర్స్ మొదలయ్యాయి మరియు ఈ వాచ్ లు సెప్టెంబర్ 16 నుండి అందుబాటులోకి వస్తాయి.