Amazfit GTR 4 New Version స్మార్ట్ వాచ్ లాంచ్ అయ్యింది: ధర మరియు ఫీచర్లు చూద్దామా.!

Updated on 05-Sep-2024
HIGHLIGHTS

Amazfit GTR 4 New Version స్మార్ట్ వాచ్ లాంచ్ ను ఇండియాలో లాంచ్ చేసింది

చూడచక్కని డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో ఈ స్మార్ట్ వాచ్ ను కంపెనీ విడుదల చేసింది

ఈ స్మార్ట్ వాచ్ సేల్ కి కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది

Amazfit GTR 4 New Version స్మార్ట్ వాచ్ లాంచ్ ను ఇండియాలో లాంచ్ చేసింది. చూడచక్కని డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో ఈ స్మార్ట్ వాచ్ ను కంపెనీ విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ సేల్ కి కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. సరికొత్తగా భారత మార్కెట్లో విడుదలైన ఈ స్మార్ట్ వాచ్ ధర మరియు ఫీచర్లు చూద్దామా. 

Amazfit GTR 4 New Version : ధర

ఈ కొత్త స్మార్ట్ వాచ్ ను రూ. 16,999 ధరలో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ను amazfit.com అధికారిక సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త వెర్షన్ స్మార్ట్ వాచ్ గెలాక్సీ బ్లాక్ మరియు బ్రౌన్ లెథర్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది.

Amazfit GTR 4 New Version : ఫీచర్స్

ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ను 1.45 ఇంచ్ వైబ్రాంట్ AMOLED స్క్రీన్ తో అందించింది. ఇది రౌండ్ డయల్ లో వస్తుంది మరియు 331 ppi తో మంచి విజువల్ అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ Alexa మరియు ఆఫ్ లైన్ వాయిస్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ను కూడా కలిగి వుంది. ఈ వాచ్ 150+ వాచ్ ఫేసెస్ మరియు ఆల్వేస్ ఆన్ స్క్రీన్ తో వస్తుంది.

ఈ వాచ్ లో లాంగ్ లైఫ్ అందించే 440mAh బ్యాటరీ ఉంది మరియు ఇది కొత్త బ్యాటరీ సేవ్ మోడ్ తో 12 రోజుల లాంగ్ లైఫ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ వాచ్ లో ఇండస్ట్రీ లీడింగ్ GPS టెక్నాలజీ మరియు విలాసవంతమైన లైఫ్ స్టైల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే, ఈ వాచ్ Zepp OS 2.0 తో కాలింగ్, హెల్త్ మ్యూజిక్ వంటి ఆల్ రౌండర్ పెర్ఫార్మన్స్ అందిస్తుంది. 

ఈ స్మార్ట్ వాచ్ డ్యూయల్ LED బయో ట్రాకర్ 4.0 PPG ఆప్టికల్ సెన్సార్ తో మరింత ఖచ్చితమైన హెల్త్ డేటా అందిస్తుందట. ఇదే కాదు 24/7 హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ మరియు స్ట్రెస్ లెవెల్స్ ను కూడా యాక్యురేట్ గా మోనిటర్ చేస్తుందట.

Also Read: Realme P2 Pro 5G: 80W ఫాస్ట్ ఛార్జ్ మరియు కర్వుడ్ స్క్రీన్ తో లాంచ్ డేట్ అనౌన్స్.!

ఈ స్మార్ట్ వాచ్ Wi-Fi, Bluetooth 5.0 & BLE, 2.4GHz సపోర్ట్ లతో వస్తుంది మరియు 5 ATM వాటర్ రెసిస్టెంట్ గ్రేడ్ తో చాలా గట్టిగా ఉంటుంది. ఈ వాచ్ మెంబర్ షిప్ కార్డ్, మ్యూజిక్ స్టోరేజ్, షార్ట్ కట్ కార్డ్స్, OTA అప్డేట్స్ మరియు ఈవెంట్ రిమైండర్స్ వంటి ఫీచర్స్ ను కూడా కలిగి వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :