చవక ధరకే 100Hz 24 ఇంచ్ FHD LED Monitor లాంచ్ చేస్తున్న Zebronics

Updated on 15-May-2024
HIGHLIGHTS

Zebronics చవక ధరలో కొత్త 100Hz 24 ఇంచ్ FHD Monitor ని లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది

ఈ మోనిటర్ ను ప్రత్యేకమైన మైక్రో సైట్ బ్యానర్ తో Flipkart టీజింగ్ చేస్తోంది

ఈ కొత్త మోనిటర్ ని మే 25వ తేదీ మార్కెట్లో విడుదల చేస్తోంది

ప్రముఖ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Zebronics చవక ధరలో కొత్త 100Hz 24 ఇంచ్ FHD Monitor ని లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ మోనిటర్ ని టీవీ మరియు కంప్యూటర్ మోనిటర్ లాగా ఉపయోగపడేలా ఫీచర్స్ కలిగి వుంది. ఈ మోనిటర్ ను ప్రత్యేకమైన మైక్రో సైట్ బ్యానర్ తో Flipkart టీజింగ్ చేస్తోంది. ఈ మోనిటర్ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.

Zebronics 100Hz 24 ఇంచ్ FHD Monitor

ప్రముఖ ఇండియన్ బ్రాండ్ జీబ్రానిక్స్ బ్రాండ్ నుండి కొత్త మోనిటర్ గొప్ప ఫీచర్స్ తో వస్తోంది. అదే Zebronics EA124 24 ఇంచ్ FHD LED మోనిటర్. ఈ కొత్త మోనిటర్ ని మే 25వ తేదీ మార్కెట్లో విడుదల చేస్తోంది. అయితే, లాంచ్ కంటే ముందే ఈ మోనిటర్ యొక్క స్పెక్స్, ఫీచర్లు మరియు రేటును కూడా జీబ్రానిక్స్ బయట పెట్టింది.

జీబ్రానిక్స్ మోనిటర్ ప్రైస్

ఈ మోనిటర్ ని కేవలం రూ. 6,999 రూపాయల ధరతో విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మోనిటర్ లాంచ్ అయిన వెంటనే అదే రోజు నుండి సేల్ కి అందుబాటులోకి కూడా వస్తుందని బావిస్తున్నారు.

Also Read: iQOO Z9X 5G: 16GB RAM ఫీచర్ తో రేపు లాంచ్ అవుతోంది.!

ఈ జీబ్రానిక్స్ మోనిటర్ ఫీచర్లు ఎలా ఉన్నాయి?

జీబ్రానిక్స్ ఈ మోనిటర్ చాలా అందమైన కలర్ మరియు స్లీక్ డిజైన్ తో అందిస్తోంది. ఈ మోనిటర్ మెటల్ స్టాండ్ తో మరియు వాల్ మౌంట్ అటాచ్ మెంట్ సపోర్ట్ తో కూడా వస్తుంది. అంటే, ఈ మోనిటర్ ను డెస్క్ పైన లేదా గోడకు కూడా తగిలించుకోవచ్చు.

Zebronics 100Hz 24 inch FHD LED Monitor

ఈ మోనిటర్ లో ఇన్ బిల్ట్ స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ మోనిటర్ 250 నిట్స్ బ్రైట్నెస్ మరియు 16.7 మిలియన్ కలర్ సపోర్ట్ తో ఉంటుందని కూడా జీబ్రానిక్స్ తెలిపింది. కనెక్టివిటీ పరంగా, ఈ మోనిటర్ లో HMDI, VGA మరియు 3.5mm ఆడియో జాక్ కూడా వుంది.

ముఖ్యంగా ఈ మోనిటర్ సాధారణ మోనిటర్స్ మాదిరిగా 60Hz రిఫ్రెష్ రేట్ కాకుండా కాకుండా 100Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :