Xiaomi X Pro QLED series నుంచి మూడు కొత్త స్మార్ట్ టీవీలు విడుదల చేసిన షియోమీ.!

Xiaomi X Pro QLED series నుంచి మూడు కొత్త స్మార్ట్ టీవీలు విడుదల చేసిన షియోమీ.!
HIGHLIGHTS

Xiaomi X Pro QLED series స్మార్ట్ టీవీ లను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది

ఈ సిరీస్ నుంచి మూడు స్మార్ట్ టీవీలు షియోమీ ఈ రోజు విడుదల చేసింది

ఈ టీవీ లను మంచి సౌండ్, విజువల్స్ మరియు ఫీచర్స్ తో షియోమీ విడుదల చేసింది

 

Xiaomi X Pro QLED series స్మార్ట్ టీవీ లను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి మూడు కొత్త స్మార్ట్ టీవీలు షియోమీ ఈ రోజు విడుదల చేసింది. ఇందులో 43 ఇంచ్, 55 ఇంచ్ మరియు 65 ఇంచ్ టీవీ లను విడుదల చేసింది. ఈ టీవీ లను మంచి సౌండ్, విజువల్స్ మరియు ఫీచర్స్ తో షియోమీ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ధర మరియు ఫీచర్లు తెలుసుకుందామా.

Xiaomi X Pro QLED series : ప్రైస్

షియోమీ ఎక్స్ ప్రో క్యూలెడ్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ధర: రూ. 29,999   

షియోమీ ఎక్స్ ప్రో క్యూలెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ధర: రూ. 44,999

షియోమీ ఎక్స్ ప్రో క్యూలెడ్ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ ధర: రూ. 62,999

ఆఫర్స్ 

ఈ స్మార్ట్ టీవీ ఆపిన గొప్ప బ్యాంక్ ఆఫర్లు కూడా షియోమీ ప్రకటించింది. ఈ టీవీలను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే యూజర్లకు గరిష్టంగా రూ. 7,000  రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఆగస్టు 30వ తేదీ నుంచి ఈ స్మార్ట్ టీవీలు  సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ టీవీ లను Amazon, Flipkart, mi.com మరియు షియోమీ రిటైల్ స్టోరేజ్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

Also Read: Vivo T3 Pro 5G: జస్ట్ ఇప్పుడే లాంచ్ అయిన వివో కొత్త ఫోన్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!            

Xiaomi X Pro QLED series : ఫీచర్లు

షియోమీ ఎక్స్ ప్రో క్యూలెడ్ స్మార్ట్ టీవీలు అల్యూమినియం మెటల్ బెజెల్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటున్నాయి. ఈ స్మార్ట్ టీవీలు 4K HDR క్యూలెడ్ ప్యానల్ మరియు Dolby Vision మరియు HDR 10 సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తాయని షియోమీ ప్రకటించింది. ఈ టీవీ MEMC రియాలిటీ ఫ్లో ఫీచర్ తో స్టన్నింగ్ విజువల్స్ ను అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీలో 32GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా షియోమీ జత చేసింది.

Xiaomi X Pro QLED series

  

ఈ కొత్త క్యూలెడ్ స్మార్ట్ టీవీ లలో HDMI 2.1, ALLM, HDMIArc, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ వుంది. ఈ టీవీ లు 30W సౌండ్ అందించే స్పీకర్లు కలిగి ఉంటాయి. ఈ టీవీ Dolby Audio, dts:X మరియు dts వర్చువల్ సపోర్ట్ తో వస్తాయి మరియు లీనమయ్యే గొప్ప సౌండ్ అందిస్తాయని షియోమీ తెలిపింది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo