Dolby Vision IQ తో బడ్జెట్ ధరలో వచ్చిన Xiaomi TV X Pro ఫస్ట్ సేల్.!

Updated on 18-Apr-2023
HIGHLIGHTS

Xiaomi ఇండియాలో తన TV X Pro Series నుండి మూడు కొత్త టీవీలను లాంచ్ చేసింది

ఈ టీవీలు సన్నని అంచులు కలిగిన ప్రీమియం మెటల్ ఫ్రేమ్ ఉంటాయి

ఈ స్మార్ట్ టీవీ Dolby Vision IQ , HDR 10+ మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది

Xiaomi ఇండియాలో తన TV X Pro Series నుండి మూడు కొత్త టీవీలను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీని సన్నని అంచులు కలిగిన ప్రీమియం మెటల్ ఫ్రేమ్ మరియు దాదాపుగా 96% స్క్రీన్ టూ బాడీ రేషియోతో తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ షియోమి స్మార్ట్ టీవీ ప్రస్తుతం మార్కెట్ లో ప్రీమియం ఫీచర్లుగా చెప్పబడుతున్న చాలా ఫీచర్లను కలిగి ఉన్నట్లు కూడా చెబుతోంది. రేపటి నుండి సేల్ కి అందుబాటులోకి వస్తున్న ఈ స్మార్ట్ టీవీ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి. 

Xiaomi TV X Pro: ధర

ఈ Xiaomi TV X Pro స్మార్ట్ టీవీ మూడు సైజులలో లభిస్తుంది. ఇందులో, స్టార్టింగ్ టీవీ 43 ఇంచ్ సైజులో, మీడియం సైజు టీవీ 50 ఇంచ్ సైజులో, 55 ఇంచ్ బిగ్ సైజ్ ఉన్నాయి. ఈ టీవీల ధరలను ఈ ఇక్కడ చూడవచ్చు. 

Xiaomi TV X Pro (43) ఇంచ్ టీవీ ధర : Rs.32,999                        

Xiaomi TV X Pro (50) ఇంచ్ టీవీ ధర : Rs.41,999

Xiaomi TV X Pro (55) ఇంచ్ టీవీ ధర : Rs.47,999

Flipkart మరియు mi స్టోర్ నుండి ఈ స్మార్ట్ టీవీ సేల్ రేపటి నుండి స్టార్ట్ అవుతుంది మరియు దీని పైన బ్యాంక్ ఆఫర్లు కూడా లభిస్తాయి.

Xiaomi TV X Pro: ప్రత్యేకతలు

ఈ షియోమి స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 4K HDR (ను 3840 x 2160) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision IQ , HDR 10+ మరియు HLG రియాలిటీ ఫ్లో సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిగలదని షియోమి చెబుతోంది. ఈ టీవీ అడాప్టివ్ బ్రైట్నెస్ Vivid పిక్చర్ ఇంజన్ 2 తో వస్తుంది.

ఈ టీవీలో అందించిన సౌండ్ టెక్నలాజి మరియు స్పీకర్ల విషయానికి వస్తే, ఈ టీవీ Dolby Atmos, DTS-HD మరియు DTS X సౌండ్ సపోర్ట్ లను కలిగివుంది. అయితే, 43 ఇంచ్ టీవీ 30W స్పీకర్లతో, 50 ఇంచ్ మరియు 55 ఇంచ్ టీవీలు 40W స్పీకర్లను కలిగి ఉంటాయి. ఈ టీవీ క్వాడ్ కోర్ A55 CPU కి జతగా 2GB మరియు 16GB స్టోరేజ్ లను కలిగి వుంది. 

ఈ టీవిలో 3HDMI (eARC), 2USB, ఆప్టికల్ పోర్ట్స్ టిప్ పాటు వై-ఫై 2×2 MIMO మరియు బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ లను కలిగి వుంది. ఇది Google TV మరియు లేటెస్ట్ PatchWall UI పైన పనిచేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :