Sale is Live: రూ.2,000 డిస్కౌంట్ అఫర్ తో Xiaomi కొత్త స్మార్ట్ టీవీల సేల్ ..!!

Sale is Live: రూ.2,000 డిస్కౌంట్ అఫర్ తో Xiaomi కొత్త స్మార్ట్ టీవీల సేల్ ..!!
HIGHLIGHTS

Xiaomi Smart TV 5A సిరీస్ స్మార్ట్ టీవీల సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది

ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి లేటెస్ట్ గా వచ్చిన స్మార్ట్ టీవీలు

2,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో వుంది

ఇండియాలో షియోమీ లేటెస్ట్ గా ప్రకటించిన Smart TV 5A సిరీస్ స్మార్ట్ టీవీల సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది. ఈ సిరీస్ నుండి మూడు కొత్త టీవీలను షియోమీ ప్రకటించింది. వీటిలో 32 ఇంచ్ HD Ready స్మార్ట్ టీవీ, 40 ఇంచ్ మరియు 43 ఇంచ్ రెండు స్మార్ట్ టీవీలు కూడా FHD రిజల్యూషన్ తో వచ్చాయి. ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి లేటెస్ట్ గా ప్రవేశించిన ఈ మూడు స్మార్ట్ టీవీలు కూడా ఈ రోజు నుండి Flipakrt మరియు mi స్టోర్ నుండి రూ.2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ తో లభిస్తున్నాయి. ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీల అఫర్ మరియు స్పెక్స్ గురించి వివరంగా చూద్దాం.    

Xiaomi Smart TV 5A : ధర

Xiaomi Smart TV 5A (32) HD రెడీ స్మార్ట్ టీవీ ధర: రూ.15,499

Xiaomi Smart TV 5A (40) FHD  స్మార్ట్ టీవీ ధర: రూ.22,999

Xiaomi Smart TV 5A (43) FHD  స్మార్ట్ టీవీ ధర: రూ.25,999

ఏప్రిల్ 30 నుండి అంటే ఈ రోజు నుండి ఈ స్మార్ట్ టీవీల సేల్ మొదలయ్యింది. ఈ స్మార్ట్ టీవీలను HDFC బ్యాంక్ కార్డ్స్ మరియు EMI ద్వారా కొనుగోలు చేసే వారికి 2,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో వుంది.

Xiaomi Smart TV 5A: ఫీచర్లు

షియోమీ విడుదల చేసిన ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీలు దాదాపుగా ఒకేవిధమైన ఫీచర్లను కలిగి ఉంటాయి. సైజు, సౌండ్ అవుట్ పుట్ మరియు రిజల్యూషన్ లలో మాత్రమే కొంచెం తేడాలు ఉంటాయి. షియోమీ స్మార్ట్ టీవీ 5ఎ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ HD రెడీ (1366×768) రిజల్యూషన్ తో వస్తే, 40 మరియు 43 ఇంచ్ స్మార్ట్ టీవీలు FHD (1920×1080) రిజల్యూషన్ తో వస్తాయి. ఈ మూడు స్మార్ట్ టీవీలు కూడా Vivid పిక్చర్ ఇంజన్ మరియు ప్రీమియం మెటల్ బెజెల్ లెస్ డిజైన్ తో వస్తాయి.

అలాగే, మూడు టీవీలు కూడా Dolby Audio మరియు DTS X & DTS X Virtual సౌండ్ టెక్నాలజీ కలిగివుంటాయి. అయితే, 40 మరియు 43 ఇంచ్ FHD టీవీలు  24W సౌండ్ అవుట్ పుట్ ను కలిగివుంటే, 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మాత్రం 20W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ షియోమీ లేటెస్ట్ స్మార్ట్ టీవీల ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఇతర ఫీచర్ల గురించి చూస్తే, ఈ మూడు స్మార్ట్ టీవీలు కూడా Android 11 OS తో పనిచేస్తాయి.

ఈ టీవీలకు బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీలు 2HMDI (1HDMI Arc)  మరియు 2 USB మరియు 1 ఈథర్నెట్  పోర్టు ను కలిగివుంది. ఈ టీవీలు క్వాడ్ కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తాయి. ఈ మూడు టీవీలలో 32 ఇంచ్ టీవీ 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తే, 40 మరియు 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీలు 1.5GB ర్యామ్ ని కలిగి ఉంటాయి. ఈ మూడు టీవీలు ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, Wi Fi మరియు బ్లూటూత్ 5.0 తో వస్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo