ఇండియాలో షియోమీ లేటెస్ట్ గా విడుదల చేసిన కొత్త స్మార్ట్ టీవీ Xiaomi Smart TV 5A Pro త్వరలో సేల్ కి రానుంది. ఈ స్మార్ట్ టీవీ ఇటీవల వచ్చిన Smart TV 5A సిరీస్ నుండి విడుదల చేసింది. ఈ లేటెస్ట్ షియోమీ స్మార్ట్ టీవీ 32 అంగుళాల పరిమాణంలో గొప్ప ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసినట్లు తెలిపింది. షియోమీ లేటెస్ట్ స్మార్ట్ టీవీ ఎలా ఉన్నదో చూద్దామా.
షియోమీ స్మార్ట్ టీవీ 5ఎ ప్రో స్మార్ట్ టీవీని రూ.16,999 రూపాయల ధరతో ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ సేల్ డేట్ ను ఇంకా ప్రకటించ లేదు. అయితే, ఈ స్మార్ట్ టీవీ mi.com పైన లిస్టింగ్ చెయ్యబడింది. అలాగే, అమెజాన్ మరియు Flipakrt పైన సేల్ కి అందుబాటులోకి రావచ్చు. ఈ స్మార్ట్ టీవీ ని ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 1,500 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.
షియోమీ విడుదల చేసిన ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ HD రెడీ (1366×768) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Vivid పిక్చర్ ఇంజన్ మరియు ప్రీమియం మెటల్ బెజెల్ లెస్ డిజైన్ కలిగివుంది. సౌండ్ పరంగా, 24W సౌండ్ అవుట్ పుట్ తో పాటుగా ఈ టీవీ Dolby Audio మరియు DTS X & DTS X Virtual సౌండ్ టెక్నాలజీ కలిగివుంది.
ఈ షియోమీ లేటెస్ట్ స్మార్ట్ టీవీ Android 11 OS పైన నడుస్తుంది. ఈ టీవీలో బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వుంది. ఇక కనెక్టివిటీ పరంగా, 2HMDI (1HDMI Arc) మరియు 2 USB మరియు 1 ఈథర్నెట్ పోర్టు ను కలిగివుంది. ఈ టీవీ Cortex-A55 క్వాడ్ కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ టీవీ 1.5GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు ALLM మోడ్ తో వస్తుంది. ఈటీవీ ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, Wi Fi మరియు బ్లూటూత్ 5.0 తో వంటి ఇతర ఫీచర్లను కూడా కలిగి వుంది.