భారతీయ మార్కెట్లో 30 వేల దరలో 43 ఇంచ్ స్మార్ట్ టీవీలు చాలానే లభిస్తున్నాయి. అయితే, Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన స్మార్ట్ టీవీలు మాత్రం తక్కువగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని షియోమి తన Redmi Smart TV X43 టీవీని 30 వేల కంటే తక్కువ ధరలో మంచి ఫీచర్లతో పాటుగా డాల్బీ విజన్ మరియు HDR 10+ సపోర్ట్ తో తీసుకువచ్చింది. ముందు నుండే అందుబాటులో వున్న స్మార్ట్ టీవీ X సిరీస్ నుండి 43 ఇంచ్ సైజులో ఈ స్మార్ట్ టీవీని తీసుకొచ్చింది.
ఈ లేటెస్ట్ రెడ్ మీ స్మార్ట్ టీవీ 43-ఇంచ్ సైజులో 4K రిజల్యూషన్ తో వచ్చింది. వాస్తవానికి, ఈ సిరీస్ నుండి ఇప్పటికే 50, 55 మరియు 65 ఇంచ్ సైజులో స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉండగా ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీని ఇందులో జతచేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీని రూ.28,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ టీవీ అమెజాన్ మరియు xiaomi అధికారిక వెబ్సైట్ నుండి లభిస్తుంది.
ఇక ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీల ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ మంచి వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్ మరియు క్రిస్పీ కలర్స్ అందించడానికి Vivid Picture Engine కలిగివుంది మరియు 92% DCI-P3 కలర్ గ్యాముట్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision, HDR 10+ మరియు HDR 10 కు సపోర్ట్ చేస్తుంది.
అలాగే, మంచి సౌండ్ అందించడానికి Dolby Audio, DTS-HD మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలజీ కి సపోర్ట్ చేసే 30W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది. అంతేకాదు, eARC పోర్ట్ ద్వారా కనెక్ట్ చేస్తే Dolby Atmos కి కూడా సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.
అలాగే కనెక్టివిటీ పరంగా, eArc సపోర్ట్ తో మొత్తం 3HMDI పోర్ట్స్ ఉన్నాయి మరియు 2USB పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లూటూత్ 5.0 కి మద్దతునిస్తుంది మరియు ఇథెర్నెట్ పోర్ట్, ఆప్టికల్, Wi-Fi సపోర్ట్ వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ ని కలిగివున్నాయి. ఈ టీవీ షియోమి యొక్క Patchwall4 UI మరియు Android Tv 10 OS తో పనిచేస్తుంది.