షియోమి కెమెరా టీవీ: 48MP డ్యూయల్ కెమెరాతో వస్తున్న షావోమి టీవీ
Mi TV 6 స్మార్ట్ టీవీ లేటెస్ట్ టెక్నాలజీతో వస్తోంది
Mi TV 6 టీవీ 100 W హెవీ సౌండ్ తో వస్తున్నట్లు టీజ్
48MP డ్యూయల్ కెమెరా సెటప్
షియోమి లేటెస్ట్ టెక్నాలజీతో తన స్మార్ట్ టీవీలను మార్కెటీలోకి తెస్తోంది. Mi TV 6 పేరుతో తెస్తున్న ఈ లేటెస్ట్ షియోమి స్మార్ట్ టీవీ స్మార్ట్ ఫోన్ మాదిరిగా కెమెరా సిస్టమ్ ను కలిగి ఉంటుంది. అదీకూడా 48MP డ్యూయల్ కెమెరా సెటప్ తో ప్రకటించనున్నట్లు టీజ్ చేస్తోంది. ఇది మాత్రమే కాదు ఈ Mi TV 6 టీవీ 100 W హెవీ సౌండ్ తో వస్తున్నట్లు కూడా టీజ్ చేస్తోంది.
ఇక ఇండియాలో లేటెస్ట్ గా వచ్చిన బడ్జెట్ 40 ఇంచ్ స్మార్ట్ టీవీ MiTV 4A 40 Horizon Edition స్మార్ట్ టీవీ Flipkart నుండి మంచి ఆఫర్లతో అమ్ముడవుతోంది. ఈ టీవీని HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% తగ్గింపు లభిస్తుంది. అంతేకాదు, ఇంకా చాలా ఆకర్షణీయమైన ఆఫర్లతో కూడా లభిస్తోంది.
MiTV 4A 40 Horizon Edition: ప్రత్యేకతలు
ఈ MiTV 4A 40 Horizon Edition స్మార్ట్ టీవీ FHD రిజల్యూషన్ తో వస్తుంది. అంటే, ఇది మీకు (1980×1080) రిజల్యూషన్ తో పిక్చర్ క్వాలిటీ ఇస్తుంది. అంతేకాదు, 178 డిగ్రీ వ్యూవింగ్ యాంగిల్ తో వస్తుంది మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ టీవీ దాదాపుగా కనిపించని విధంగా సన్నని అంచులతో వుంటుంది. మంచి కలర్స్ అందించగల Vivid Picture Engine ఇందులో వుంది.
ఈ టీవిలో క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వండింది. ఇక సౌండ్ పరంగా, ఈ టీవీ DTS-HD మరియు Streo రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ టీవీ లలో రెండు 10×2 స్పీకర్లతో 20W సౌండ్ అందుతుంది.
ఈ షియోమి టీవీలో మల్టి కనెక్టివిటీ మీకు లభిస్తుంది. ఇందులో, WiFi, Ethernet , 3HDMI, మరియు 2 USB పోర్ట్స్ తో పాటుగా S/PDIF కూడా వుంది. ఇది Android 9 మరియు PatchWall OS తో పనిచేస్తుంది మరియు గూగుల్ అసిస్టెంట్ తో వస్తుంది.