Xiaomi నుండి వస్తున్న మరొక కొత్త స్మార్ట్ టీవీ..!!
షియోమీ స్మార్ట్ టీవీ 5A ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది
ఈ స్మార్ట్ టీవీ A55 క్వాడ్ కోర్ ప్రాసెసర్ వస్తోంది
స్మార్ట్ టీవీ 4A కి తరువాత తరం స్మార్ట్ టీవీగా 5A వస్తుంది
షియోమీ ఏప్రిల్ 27 న జరగనున్న లాంచ్ ఈవెంట్ ద్వారా పలు డివైజ్ లను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఈ కార్యక్రమం ద్వారా Xiaomi 12 Pro మరియు షియోమీ స్మార్ట్ టీవీ 5A లను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో విడుదల చేయనున్నట్లు చెబుతున్న స్మార్ట్ టీవీ యొక్క కొన్ని కీలకమైన ఫీచర్లను కూడా కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. టీజర్ ద్వారా అందించిన వివరాల ప్రకారం ఈ స్మార్ట్ టీవీ A55 క్వాడ్ కోర్ ప్రాసెసర్ తీసుకువస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇది మాత్రేమే కాదు మరిన్ని వివరాలను గురించి కూడా టీజింగ్ మొదలు పెట్టింది. మరి ఈ అప్ కమింగ్ షియోమీ స్మార్ట్ టీవీ యొక్క విశేషాలు ఏమిటో చూసేద్దామా.
ఈ షియోమీ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ అతి సన్నని బెజెల్స్(అంచులు) తో కనిపిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పైన Vivid కలర్స్ ను అందించే విధంగా Truly Vivid డిస్ప్లేతో వస్తున్నట్లు కూడా చెబుతోంది. ఈ స్మార్ట్ టీవీమీ ప్రీమియం మరియు సుందరమైన ఫినిషింగ్ తో కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సిరీస్ నుండి గతంలో వచ్చిన స్మార్ట్ టీవీ 4A కి తరువాత తరం స్మార్ట్ టీవీగా 5A వస్తుంది. అంటే, ఫీచర్ల పరంగా మరింత కొత్తగా షియోమీ స్మార్ట్ టీవీ 5A ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ గురించి కంపెనీ ఇప్పటి వరకు ఎక్కువగా ఎటువంటి స్పెక్స్ వెల్లడించనప్పటికీ, గతంలో వచ్చిన స్మార్ట్ టీవీ 4A లో వున్నా డిస్ అడ్వాంటేజ్ లను దాటి స్పెక్స్ మరియు ఫీచర్ల పరిధిని మరింతగా పెంచవచ్చని భావిస్తున్నారు. ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0 సపోర్ట్ మరియు Dts-HD తో పాటుగా Dolby Audio సపోర్ట్ అందించడమే కాకుండా సౌండ్ వాట్స్ ను కూడా 4A కంటే పెంచవచ్చు. ఇవన్నీ కూడా స్మార్ట్ టీవీ లో షియోమీ జత చేయవచ్చని భావిస్తున్న ఫీచర్లు మాత్రమే. ఈ టీవీ స్పెక్స్ గురించి ఇప్పటి వరకూ షియోమీ ఎటువంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు.