షియోమి ఫిబ్రవరి 9 న చాలా ప్రోడక్ట్స్ ను లాంచ్ చెయ్యడానికి సిద్ధమవుతోంది మరియు వాటిలో Redmi Smart Tv X43 కూడా ఒకటి. ఇది 43 ఇంచ్ సైజులో వస్తున్న 4K UHD స్మార్ట్ టీవీ. ఈ సిరీస్ నుండి ఇప్పటికే X50, X55 మరియు X65 ఇంచ్ రోజుల్లో పెద్ద టీవీలు ఉండగా కంపెనీ ఇప్పుడు బడ్జెట్ ధరలో 4K ని ఆస్వాదించేందుకు వీలుపడే 43 ఇంచ్ సైజులో ఈటీవీని లాంచ్ చేయడానికి షియోమి సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క కొన్ని ఫీచర్లను కూడా కంపెనీ వెల్లడించింది.
ఈ స్మార్ట్ టీవీ టీజర్ పేజ్ ద్వారా Redmi Smart Tv X43 టీవీని కూడా X సిరీస్ లో ముందుగా తీసుకొచ్చిన పెద్ద టీవీల మాదిరిగా 4K HDR మరియు Dolby Vision సపోర్ట్ తో తీసుకువస్తునట్లు పేర్కొంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవిలో అందించిన సౌండ్ టెక్నలజీ గురించి కూడా తెలిపింది. ఈ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు హెవీ సౌండ్ అందించగల 30W స్పీకర్లను కలిగి ఉంటుంది.
ఇక డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే, ఈ Redmi Smart Tv X43 పేరు సుచినట్లుగానే 43 ఇంచ్ స్మార్ట్ టీవీ కావచ్చు. ఇందులో, అందించిన ప్రోసెసర్ గురించి పూర్తిగా వివరించలేదు కానీ, ఫ్యూచర్ రెడీ మరియు ఫ్లాగ్ షిప్ ప్రోసెసర్ తో తీసుకువస్తునట్లు మాత్రం తెలిపింది. Xiaomi యొక్క స్వంత PatchWall UIతో ఆండ్రాయిడ్ TV OSలో టీవీ రన్ అవుతుంది. అయితే, ఇది e-ARC మరియు ALLM (ఆటో తక్కువ లేటెన్సీ మోడ్) వంటి దాని పెద్ద సహోదరులలో కనిపించే ఫీచర్‌లకు మద్దతు ఇస్తుందని మనం ఆశించవచ్చు.