Mi TV 4A 40: జూన్ 1న షియోమి కొత్త స్మార్ట్ టీవీ లాంచ్

Updated on 26-May-2021
HIGHLIGHTS

షియోమి తన లేటెస్ట్ స్మార్ట్ టీవీ ని ఇండియాలో విడుదల చేస్తోంది

ఇది చాలా సన్నని అంచులు కలిగిన "Horizon Display" తో వస్తుంది

ఈ షియోమి టీవీ 40 ఇంచ్ పరిమాణంలో వస్తుంది

షియోమి తన లేటెస్ట్ స్మార్ట్ టీవీ ని ఇండియాలో విడుదల చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ని Mi TV 4A 40 పేరుతో లాంచ్ చేస్తోంది. ఈ టీవీ 40 ఇంచ్ పరిమాణంలో వస్తుంది మరియు ఇది చాలా సన్నని అంచులు కలిగిన "Horizon Display" తో వస్తుంది. ఈ హరిజోన్ డిస్ప్లే ఎడిషన్ నుండి ఇప్పటికే 32 ఇంచ్ మరియు 43 ఇంచ్ సైజుల్లో రెండు స్మార్ట్ టీవీ లను అందించిన షియోమి, ఇప్పుడు 40 ఇంచ్ టీవీ ని విడుదల చేస్తోంది.

Mi TV 4A 40: ప్రత్యేకతలు

ఇక ఈ Mi TV 4A 40 ప్రత్యేకతల విషయానికి వస్తే, కంపెనీ రీసెంట్ గా ప్రకటించిన QLED టీవీల కంటే చాలా సరసమైనవిగా ఉంటాయి. ఈ టీవీ గురించి అందించిన టీజర్ ఇమేజ్ నుండి ఈ టీవీ చాలా సన్నని అంచులతో ఉన్నట్లు ప్రకటించింది. మిగిలిన  వివరాలు ఇంకా తెలియనప్పటికీ, ఈ సిరీస్ లో ముందుగానే వచ్చిన రెండు స్మార్ట్  టీవీల మాదిరిగానే మంచి స్పెక్స్ తో ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇక ఈ టీవీ ఎటువంటి ధరలో ప్రకటించవచ్చు? అని కూడా టెక్ వర్గాలు అంచనా వేశాయి. ప్రస్తుత టీవీ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని షియోమి లాంచ్ చేయబోయే ఈ కొత్త స్మార్ట్ టీవీ ధరను రూ.20,000 నుండి రూ.25,000 రూపాయల ధర పరిధిలో ఉంచవచ్చని ఊహిస్తున్నారు. ఈ Mi TV 4A 40 మంచి సౌండ్ మరియు పిక్చర్ క్వాలిటీ అందించే ఫీచర్లతో వుంటుందని కూడా అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :