ఇండియాలో కొత్త MagiQLED స్మార్ట్ టీవీలను లాంచ్ చేస్తున్న షియోమీ.!

ఇండియాలో కొత్త MagiQLED స్మార్ట్ టీవీలను లాంచ్ చేస్తున్న షియోమీ.!
HIGHLIGHTS

కొత్త QLED స్మార్ట్ టీవీ సిరీస్ ను విడుదల చేస్తున్నట్లు షియోమీ ప్రకటించింది

Xiaomi XPro QLED సిరీస్ నుండి ఈ కొత్త స్మార్ట్ టీవీ లను విడుదల చేస్తోంది

షియోమీ XPro క్యూలెడ్ సిరీస్ నుంచి మూడు స్మార్ట్ టీవీ లను విడుదల చేస్తుంది

MagiQLED: ఇండియాలో కొత్త QLED స్మార్ట్ టీవీ సిరీస్ ను విడుదల చేస్తున్నట్లు షియోమీ ప్రకటించింది. Xiaomi XPro QLED సిరీస్ నుండి ఈ స్మార్ట్ టీవీ లను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ సిరీస్ తెస్తున్న టీవీ లను మ్యాజిక్ క్యూలెడ్ టీవీ లు గా పిలుస్తోంది. అందుకు తగిన కారణాలు కూడా లాంచ్ కంటే ముందే టీజర్ పేజీ ద్వారా వెల్లడించింది.

MagiQLED: లాంచ్

Xiaomi XPro క్యూలెడ్ స్మార్ట్ టీవీ లను ఆగస్టు 27వ తేదీ ఇండియాలో విడుదల చేస్తుంది. ఈ సిరీస్ నుంచి 43 ఇంచ్ 55 ఇంచ్ 65 ఇంచ్ మూడు క్యూలెడ్ టీవీ లను లాంచ్ చేయనున్నట్లు టీజర్ పేజీ ద్వారా తెలిపింది. ఈ స్మార్ట్ టీవీ కేటగిరీలో మ్యాజిక్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటాయని, అందుకే ఈ పేరును ఈ టీవీ లకు పెట్టింది అని హింట్ కూడా ఈ షియోమీ ఇంచింది.

xiaomi MagiQLED Smart Tv

MagiQLED: ఫీచర్స్

షియోమీ XPro క్యూలెడ్ సిరీస్ నుంచి మూడు స్మార్ట్ టీవీ లను విడుదల చేస్తుంది. ఇందులో 43 ఇంచ్ క్యూలెడ్, 55 ఇంచ్ క్యూలెడ్ మరియు 65 ఇంచ్ క్యూలెడ్ ఉంటాయి. ఈ టీవీలు అతి సన్నని అంచులతో మరియు అందమైన స్లీక్ డిజైన్ తో ఉంటాయి. ఈ టీవీలు అద్భుతమైన గొప్ప బ్రైట్నెస్ తో వస్తాయని షియోమీ తెలిపింది.

ఈ స్మార్ట్ టీవీ సరికొత్త టెక్ తో కలర్స్ తో మ్యాజిక్ చేస్తుందని కూడా తెలిపింది. ఈ టీవీ లు గొప్ప కాంట్రాస్ట్ లెవెల్స్ తో గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని కూడా షియోమీ ఈ టీవీ ల గురించి గొప్పగా చెబుతోంది. ఈ అప్ కమింగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీలు సాటిలేని స్టన్నింగ్ డిటైల్స్ తో 4K విజువల్ మ్యాజిక్ వండర్ అవుతుంది, అని కూడా షియోమీ గొప్పగా చెబుతోంది.

Also Read: Smart Tv offer: బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ అందించిన ఫ్లిప్ కార్ట్.!

ఈ టీవీ లో గొప్ప సౌండ్ సెటప్ ఉందని, ఇది శ్రోతల చెవులకు శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తుందని కూడా షియోమీ గొప్పగా చెబుతోంది. మొత్తంగా, ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ సిరీస్ గురించి షియోమీ చెబుతున్న విషయాలు చూస్తుంటే, ఈ టీవీ లను గొప్ప డిజైన్, విజువల్స్ అందించే స్క్రీన్, ఫీచర్స్ మరియు గొప్ప సౌండ్ సపోర్ట్ తో ఈ టీవీ లను పరిచయం చేయబోతున్నట్లు అనిపిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo