Xiaomi నుండి వచ్చిన మరొక స్మార్ట్ టీవీ.. ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

Updated on 16-Aug-2022
HIGHLIGHTS

షియోమీస్మార్ట్ టీవీ 5A సిరీస్ నుండి మరొక స్మార్ట్ టీవీ లాంచ్

Xiaomi Smart TV 5A Pro టీవీ ప్రో ఫీచర్లను కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది

ఈ టీవీ Dolby Audio మరియు DTS X & DTS X Virtual సౌండ్ టెక్నాలజీ కలిగివుంది

షియోమీ తన స్మార్ట్ టీవీ 5A సిరీస్ నుండి మరొక బడ్జెట్ స్మార్ట్ టీవీ ని ఈరోజు ఇండియన్ మార్కెట్ కి పరిచయం చేసింది. అదే, Xiaomi Smart TV 5A Pro స్మార్ట్ టీవీ మరియు ఇది 32 ఇంచ్ సైజులో ప్రో ఫీచర్లను కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ టీవీ ప్రీమియం మెటల్ బెజెల్ లెస్ డిజైన్ తో వచ్చింది. షియోమీ లేటెస్ట్ గా తీసుకువచ్చిన ఈ బడ్జెట్ స్మార్ట్ టీవీ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా. 

Xiaomi Smart TV 5A Pro: ధర మరియు సేల్

షియోమీ స్మార్ట్ టీవీ 5ఎ ప్రో స్మార్ట్ టీవీని రూ.16,999 రూపాయల ధరతో ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ సేల్ డేట్ ను ఇంకా ప్రకటించ లేదు. అయితే, ఈ స్మార్ట్ టీవీ mi.com పైన లిస్టింగ్ చెయ్యబడింది. అలాగే, అమెజాన్ మరియు Flipakrt పైన సేల్ కి అందుబాటులోకి రావచ్చు. ఈ స్మార్ట్ టీవీ ని ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 1,500 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.            

Xiaomi Smart TV 5A Pro: ఫీచర్లు

షియోమీ విడుదల చేసిన ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ HD రెడీ (1366×768) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Vivid పిక్చర్ ఇంజన్ మరియు ప్రీమియం మెటల్ బెజెల్ లెస్ డిజైన్ కలిగివుంది. సౌండ్ పరంగా, 24W సౌండ్ అవుట్ పుట్ తో పాటుగా ఈ టీవీ Dolby Audio మరియు DTS X & DTS X Virtual సౌండ్ టెక్నాలజీ కలిగివుంది. 

ఈ షియోమీ లేటెస్ట్ స్మార్ట్ టీవీ Android 11 OS పైన నడుస్తుంది. ఈ టీవీలో బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వుంది. ఇక కనెక్టివిటీ పరంగా, 2HMDI (1HDMI Arc)  మరియు 2 USB మరియు 1 ఈథర్నెట్  పోర్టు ను కలిగివుంది. ఈ టీవీ Cortex-A55 క్వాడ్ కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ టీవీ 1.5GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు ALLM మోడ్ తో వస్తుంది. ఈటీవీ ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, Wi Fi మరియు బ్లూటూత్ 5.0 తో వంటి ఇతర ఫీచర్లను కూడా కలిగి వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :