రెడ్ మీ ఈరోజు తన కొత్త స్మార్ట్ టీవీలను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్ టీవీలు భారీ ఫీచర్లతో మరియు ఆకట్టుకునే ధరలో వచ్చాయి. ఈ స్మార్ట్ టీవీలు షియోమీ అధికారిక వెబ్సైట్ నుండి అమెజాన్ సేల్ నుండి అందుబాటులో ఉంటాయి. షియోమి ఈ రెండు టీవీలను 32 ఇంచ్ మరియు 43 ఇంచ్ రెండు సైజుల్లో ప్రకటించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీలు Dolby Audio, DTS-HD మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలజీ తో సహా చాలా లేటెస్ట్ బెస్ట్ ఫీచర్లతో అలరిస్తాయి. ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీల గురించి వివరంగా చూద్దాం.
ఈ లేటెస్ట్ రెడ్ మీ స్మార్ట్ టీవీలు రెండు సైజుల్లో లభిస్తాయి. వీటిలో, 32 HD రెడీ రెజల్యూషన్ మరియు 4K FHD రెజల్యూషన్ తో వస్తాయి. ఈ స్మార్ట్ టీవీలు 32 ఇంచ్ రూ.15,999 రూపాయల ధరతో, 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ రూ.25,999 రూపాయల ధరతో ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యాయి.
ఇక ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీల ఫీచర్ల విషయానికి వస్తే, ఈ రెండు టీవీలు కూడా మంచి వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్ మరియు క్రిస్పీ కలర్స్ అందించడానికి Vivid Picture Engine కలిగివుంది. మంచి వ్యూవింగ్ తో పాటుగా గొప్ప సౌండ్ అందించడానికి Dolby Audio, DTS-HD మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలజీ కి సపోర్ట్ చేసే 20W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తాయి.
అలాగే కనెక్టివిటీ పరంగా, eArc సపోర్ట్ తో మొత్తం 2HMDI పోర్ట్స్ ఉన్నాయి మరియు 2USB 2.0 పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లూటూత్ 5.0 కి మద్దతునిస్తుంది మరియు ఇథెర్నెట్ పోర్ట్, Wi-Fi సపోర్ట్ వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ ని కలిగివున్నాయి.
ఈ టీవీలు షియోమి యొక్క Patchwall 4 UI మరియు Android Tv 11 OS తో పనిచేస్తుంది. ఈ టీవీ 75 కంటే పైచిలుకు ఉచిత లైవ్ ఛానల్స్ కు కూడా సపోర్ట్ చేస్తుంది.