షియోమీ ఈరోజు కొత్త స్మార్ట్ టీవీలు మరియు స్మార్ట్ వాచీలు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో Xiaomi smart TV X Series 2024 Edition నుంచి మూడు కొత్త 4K Smart Tv లను ఆకట్టుకునే ఫీచర్స్ తో సరసమైన ధరలో అందించింది. ఈ కొత్త స్మార్ట్ టీవీ ల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.
షియోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ 2024 ఎడిషన్ నుంచి 43 ఇంచ్, 55 ఇంచ్ మరియు 65 ఇంచ్ సైజుల్లో మూడు కొత్త స్మార్ట్ టీవీ లను విడుదల చేసింది. ఇందులో 43 ఇంచ్ స్మార్ట్ టీవీని రూ. 28,999 ధరతో, 50 ఇంచ్ స్మార్ట్ టీవీని రూ. 35,999 ధరతో మరియు 65 ఇంచ్ స్మార్ట్ టీవీని 39,999 ధరతో లాంచ్ చేసింది.
ఈ స్మార్ట్ టీవీల పైన గొప్ప బ్యాంక్ ఆఫర్లు కూడా అందించింది. అన్ని ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీని రూ. 24,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఈ స్మార్ట్ టీవీ ఆగస్టు 30 వ తేదీ నుంచి Amazon, Flipkart, mi.com మరియు షియోమీ రిటైల్ స్టోర్స్ నుంచి సేల్ అవుతాయి.
Also Read: Xiaomi X Pro QLED series నుంచి మూడు కొత్త స్మార్ట్ టీవీలు విడుదల చేసిన షియోమీ.!
ఈ టీవీలు ప్రీమియం మెటల్ బడి మరియు బెజెల్ లెస్ డిజైన్ తో లాంచ్ అయ్యాయి. ఈ టీవీలు Cortex A55 క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తాయి. ఈ షియోమీ 4K స్మార్ట్ టీవీలు Vivid Picture Engine మరియు Dolby Vision సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తాయని షియోమీ తెలిపింది. అంతేకాదు, స్థిరమైన విజువల్స్ కోసం MEMC రియాలిటీ ఫ్లో ఫీచర్ ను కూడా కలిగిరి ఉంటుంది.
ఈ టీవీలో 30W సౌండ్ అందించే రెండు స్పీకర్ లను కలిగి ఉంటాయి. సౌండ్ టెక్నాలజీ పరంగా, ఈ టీవీ లో Dolby Audio, DTS: X మరియు DTS Virtual: X సపోర్ట్ వుంది. ఇక కనెక్టివిటీ పరంగా, ఈ టీవీ లో బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, 3 HDMI (1 eARC), 2 USB, 1 ఇయర్ ఫోన్, 1 AV మరియు 1 ఈథర్నెట్ పోర్ట్ లను కలిగి ఉంటుంది.